సూర్య : జై భీమ్ విషయంలో చాలా బాధపడ్డా.. అలా చేసి ఉండాల్సింది కాదు..!!
తన భర్తకు న్యాయం జరగాలని సెంగెణి న్యాయవాది చంద్రు సాయంతో పోరాడుతుంది. ఈ కేసులో సెంగెణి గెలుస్తుంది.
ఈ సినిమాలో రాజా కణ్ణుగా మణికంఠన్, సెంగెణిగా లిజో మోల్ అద్భుతంగా నటించారు.ఇక అసలైన హీరో పాత్ర న్యాయవాది చంద్రుగా సూర్య అద్భుతంగా నటించారు.. సినిమాలో కొన్ని సీన్స్ ప్రేక్షకులని కంట తడి పెట్టిస్తాయి.. అనగారిన వర్గాలకు జరిగే అన్యాయాన్ని దర్శకుడు ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.ఈ చిత్రాన్నీ జ్యోతిక, సూర్యలు 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. కరోనా సమయంలో ఈ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ఓటీటీలో విడుదలయ్యింది.ఓటీటీలో ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. దీపావళి సందర్భంగా తన సినిమా కోసం ఆశగా వచ్చిన ఓ పెద్దాయన థియేటర్ లో నా సినిమా లేకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లడం భాధ అనిపించిందని సూర్య ఇటీవల తెలిపారు.. ఆ పెద్దాయనకు అసలు ఓటీటీ అంటే ఏంటో తెలీదు..నా సినిమా వస్తుందని ఎంతో ఆశతో వచ్చారు.. కానీ చివరికీ నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు..ఆ విషయం తెలిసి భాధ పడ్డా అని సూర్య తెలిపారు.. తమ సినిమా ఓటీటీలో విడుదల చేసి తప్పు చేశామని సూర్య తెలిపారు.. అలాంటి తప్పు మళ్ళీ చేయకూడదని అనుకున్నట్లు సూర్య తెలిపారు..