ఒకేసారి డౌన్ అయిన స్టార్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ .. కారణం ఏంటంటే..?
ఆడియన్స్ కూడా ఎక్కువగా ఫ్రీ కంటెంట్ వైపే చూస్తున్నారు ..దాంతో నాన్ థియెట్రికల్ సేలబుల్ హీరోయిన్స్ మార్కెట్ దారుణంగా పడిపోయింది . దానికి కారణం గానే తమన్న , కీర్తి సురేష్ , కాజల్ రాశి కన్నా లాంటి హీరోయిన్లు ఓటీటీలో అసలు కనిపించట లేదు . కరోనా సమయంలో స్టార్ హీరోయిన్లు అంతా ఓటిటి వైపు వెళ్లిపోయారు కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెట్ దారుణంగా పతనమైంది .. మొదటి లో ఉన్నంత గా సినిమాలు ఇక్కడ అమ్ముడు అవ్వట్లేదు . పైగా శ్రీలీల , కృతి శెట్టి లాంటి వాళ్లంతా ఓ సీజన్‌లో మెరిసి మాయం అయిపోతున్నారు .
పూజా హెగ్డే , సమంత , తమన్నా టైమ్ అయిపోయింది . అందుకే మునపట్లా హీరోయిన్ల కు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు . అలాగే రోజుకొక కొత్త హీరోయిన్ చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెడుతుంది.. ఇలా గతంలో ఉన్నంత క్రేజ్ హీరోయిన్లకు ఇప్పుడు లేదు.. అలాగే స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్ ఉన్న హీరోయిన్లనే తమ సినిమాల్లో హీరోయిన్గాా తీసుకుంటున్నారు. అలాగే ఆ సినిమాల్లో హీరోయిన్లకు గొప్ప పాత్రలు కూడా ఉండటం లేదు. అన్నం కూడా హీరోయిన్ల రెమ్యూనరేషన్ తగ్గటంలో కారణమని చెప్పొచ్చు.