అత్తారింటికి దారేది : సినిమాలో ఈ మిస్టేక్ మీరు గమనించారా.. త్రివిక్రమ్ ఇంత తప్పు ఎలా చేశాడు..?
ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ లోనే వినిపించేసారట. స్టోరీ విని పవన్ కళ్యాణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చాలా హైలెట్ గా మారాయి . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఒక సీన్ కి సంబంధించి న రిలేటెడ్ ఫోటోను బాగా ట్రెండ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటారు. మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అంటూ చెప్పుకొస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ సీన్లో కోపంతో ఊగిపోతూ ఉంటాడు . అయితే అదే మూమెంట్లో ఆలీ వచ్చి ఒక సిగరెట్ తీసుకోరా అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడే పవన్ కళ్యాణ్ కోపంతో రగిలిపోయి.. తన బౌన్సర్లతో బాగా కొట్టిస్తాడు . ఈ సీన్ తెరపై బాగా పండింది . అంతేకాకుండా తాను డ్రైవర్ కాదని తన గురించి అసలు నిజాలు బయటపెడతాడు. అప్పుడు థియేటర్స్ లో చప్పట్లు మారుమ్రోగిపోతాయి. ఇక కోపంలో కొట్టిన పవన్ ఆ తర్వాత ఆలీకి లక్షల డబ్బు ఉన్న సూట్ కేస్ ని కూడా ఇస్తాడు . అయితే అప్పటికే ఈ సూట్ కేసుని ఎంఎస్ నారాయణ పవన్ కి తెరిచి చూపించాడు. కానీ ఆలీ మాత్రం అదే సూట్ కేసును తీసుకువెళ్లి ఓపెన్ అవ్వడం లేదు అని చెప్తాడు. దీంతో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు త్రివిక్రమ్ అంటూ నెటీజన్స్ ట్రోల్ చేస్తున్నారు . గురూజీ కూడా కొన్ని విషయాలలో తడబడతాడు అన్నదానికి ఇదే ఎగ్జాంపుల్ అంటూ చెప్పుకొస్తున్నారు..!