అమరన్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు !

Seetha Sailaja
దీపావళి రేస్ కు విడుదలైన ‘అమరన్’ కేవలం మూడు రోజులలో 100 కోట్ల కలక్షన్స్ వసూలు చేయడం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈమూవీ కలక్షన్స్ దీపావళి తరువాత కొంతవరకు తగ్గినప్పటికీ రాబోతున్న వీకెండ్ లో ఈమూవీ కలక్షన్స్ చాల బాగుంటాయని అంచనాలు ఉన్నాయి. దీనితో ఈమూవీ బయ్యర్లకు రెట్టింపు లాభాలు రావడం ఖాయం అన్నవార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఈమూవీకి ఈరేంజ్ లో సూపర్ సక్సస్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు కూడ ఊహించలేకపోయాయి. డబ్బింగ్ సినిమాగా విడుదలైన ఈమూవీకి పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా మౌత్ టాక్ తో ఈమూవీ కలక్షన్స్ బాగా పెరగడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

సాయిపల్లవి నటన ఎమోషన్స్ మేజర్ సాహసం ఇవన్నీ కలిపి సూపర్ హిట్ మూవీగా మార్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమూవీ పై మరొక ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీ కథ ప్రకారం సాయి పల్లవి నటించిన ఇందూ పాత్రను క్రిష్టియన్ గా దర్శకుడు చూపించాడు. ఆమె కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఆచార వ్యవహారాలు చర్చికి వెళ్లడంలాంటి సీన్స్ చూసిన సగటు ప్రేక్షకుడు ఆమెను క్రిష్టియన్ గా భావించవలసి వచ్చింది. ఆమూవీలో ముకుంద వరద రాజన్ పాత్ర కులం ఏమిటి అంటూ కొందరు పరిశోధన మొదలుపెట్టారు.

ఈవిషయాలు అన్నీ దర్శకుడు రాజ్ కుమార్ పెరియర్ స్వామి దృష్టి వరకు రావడంతో అతడు ఈవిషయం పై స్పందిస్తూ కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు. ‘అమరన్’ మూవీని తీస్తున్న సందర్భంలో తాను రాజ్ కుమార్ పెరియర్ స్వామి తల్లి తండ్రుల వద్దకు తాను వెళ్ళానని అక్కడ తన సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మేజర్ జనరల్ పాత్రను పోషించిన ముకుంద వరద రాజన్ తల్లి తండ్రుల వద్దకు వెళ్ళినప్పుడు తన కొడుకు పై తీస్తున్న బయోపిక్ లో హీరో కనిపించాలి కానీ తమ కులం కనిపించ కూడదు అని కండిషన్ పెట్టడంతో ముకుంద వరద రాజన్ పాత్ర కుల ప్రస్తావన తన సినిమాలో తీసుకురాకుండా జాగ్రత్త పడిన విషయాన్ని దర్శకుడు రాజకుమార్ పెరియార్ స్వామి క్లారిటీ ఇచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: