టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో అల్లు అరవింద్ ఒకరు. ఈయన ఎన్నో సంవత్సరాలుగా నిర్మాణ రంగంలో ఉంటూ ఎన్నో పెద్ద పెద్ద సినిమాలను నిర్మించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్య తో తండెల్ అనే మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఏ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని ఓ వార్త గత కొన్ని రోజులుగా అవుతుంది. ఆ వార్తలకు తగ్గట్టు ఈ మూవీ దర్శకుడు కూడా మా సినిమా మొత్తం పనులు సంక్రాంతి లోపే పూర్తి అవుతాయి. విడుదల చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ నిర్మాత , హీరో చేతుల్లోనే అంత ఉంది అని చెప్పాడు. ఇక నిన్న ఈ మూవీ బృందం ఓ పెద్ద ఈవెంట్‌ను నిర్వహించి ఈ సినిమాను ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఇలా సంక్రాంతి నుండి తప్పుకొని ఫిబ్రవరి 7 వ తేదీన ఈ సినిమా విడుదల చేయడంపై ఈ మూవీ దర్శకుడు చందు మండేటి మాట్లాడుతూ ... మేము సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలి అనుకున్నాం.
కానీ అల్లు అరవింద్ గారికి ఉన్న స్ట్రాటజీ ప్రకారం ఈ మూవీబిని ఫిబ్రవరి నెలలో విడుదల చేయడం కరెక్ట్. ఎందుకు అంటే ఆయన అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫిబ్రవరి 7 వ తేదీన అయితే ఈ సినిమాకు సూపర్ కలెక్షన్స్ వస్తాయి అని ఆయన చెప్పాడు. ఇకపోతే ఇదే ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ... సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. వాటితో పోటీ పెట్టుకోవడం ఇష్టం లేదు. దాని ద్వారా థియేటర్స్ షేర్ అవుతాయి. దాని వల్ల మా సినిమాకి నష్టం జరుగుతుంది. అందుకే ఫిబ్రవరి నెలలో రాబోతున్నాం అని ప్రకటించాడు.