నటి కస్తూరి అరెస్ట్ ?.. సారీ చెప్పినా తప్పని చిక్కులు !
తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో అత్త, అమ్మ, అక్క, వదిన వంటి పాత్రలలో మాత్రమే నటిస్తోంది. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లోను నటిస్తూ సందడి చేస్తోంది. కాగా, నటి కస్తూరి అరెస్ట్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలుగువారిని కించపరుస్తూ రెండు రోజుల క్రితం తాను అనుచిత వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ అలనాటి నటి కస్తూరిపై తెలుగు సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుపై చెన్నై పోలీసులు యాక్షన్ లోకి దిగారు. 300 ఏళ్ల క్రితం అంతఃపురంలో మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చి వారు తమిళులుగా చెలామని అయ్యారని కస్తూరి కామెంట్ చేసింది. దీంతో ఈ మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. తమిళనాడులో పలు జిల్లాల్లో తెలుగు నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు ఎగ్మూర్ పోలీసులు.
మరోవైపు ఈ అంశంపై నటి కస్తూరి క్షమాపణలు కూడా కోరారు. అయిన ప్పటికీ ఈ విషయంపై కస్తూరిపై చర్యలు తీసుకోవాలంటూ కేసులు పెడుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా కస్తూరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారట తెలుగు సంఘాలు నాయకులు. దీంతో టాలీవుడ్ అలనాటి నటి కస్తూరిని అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే.. రాలేదని చెప్పవచ్చును.