యంగ్ హీరోతో త్వరలో ఏడడుగులు వేయబోతున్న టాలీవుడ్ హీరోయిన్..!

Divya

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.  బాలీవుడ్ లో భారీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆది పురుష్ సినిమాలో సీతగా నటించి మంచి మార్కులే వేయించుకుంది. ఇటీవల దో పత్తీ అనే అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు లవ్ లో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కృతి సనన్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. గత కొద్ది రోజులుగా భూల్ భూలయ్య 3 సినిమాలో హీరోగా నటిస్తున్న కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి . అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు రాగా.. ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయాలు తెలియకపోయినా.. ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కార్తీక్ ఆర్యన్.
అయితే ఆయన రిలేషన్షిప్ పై ఆసక్తికర కామెంట్లు చేశాడు. నేను సింగిల్ , ఎవరికి లైవ్ లొకేషన్ పంపాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ఏ డేటింగ్ యాప్ లోనూ నేను లేను. చందు ఛాంపియన్ కి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాను.  నాకు డేటింగ్ చేసే అంత టైం కూడా లేదు. భూల్ భూలయ్య  -3  షూటింగ్ పూర్తి చేయడం పెద్ద సవాలుగా మారింది. అందుకే వీటిని నేను ఆలోచించడం లేదు అంటూ తెలిపారు కార్తీక్ ఆర్యన్.మొత్తానికైతే కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు రావడంతో ఒక్క మాటలో క్లారిటీ ఇచ్చారు కార్తీక్ ఆర్యన్.
ఇక కృతి సనన్ విషయానికి వస్తే ..గతంలో కూడా ఈమె ప్రభాస్ తో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వినిపించాయి.ముఖ్యంగా కరణ్ జోహార్ షో లో ఈ వార్తలు బయటకు రావడంతో అదే సమయంలో ఈ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది   ప్రభాస్ తనకు స్నేహితుడే మాత్రమేనని తనకు ప్రభాస్తో ఎటువంటి ఎఫైర్ లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పటికైనా కృతి సనన్ పై వస్తున్న వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: