దర్శక ధీరుడు రాజమౌళికి బాగా కోపం వస్తే ఇంట్లో వారు పారిపోవాల్సిందే.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ చెప్పిన నిజం ఇదే..!

Amruth kumar
మన భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది అగ్ర దర్శకులు ఉన్నారు .. ఎన్నో గొప్ప సినిమాలు తీశారు తీస్తున్నారు కూడా.. అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కె.వి.రెడ్డి , కె.విశ్వనాథ్ , రాఘవేందర్రావు వంటి ఎందరో అగ్ర దర్శకులు ఎన్నో గొప్ప సినిమాలు తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచారు. అయితే వీరందరిలో తెలుగు సినిమాని ప్రపంచ సినిమా స్థాయికి తీసుకు వెళ్లిన దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. బాహుబలి సినిమాల‌తో తెలుగు సినిమాను పాన్‌ ఇండియన్ సినిమాకు రారాజుగా చేశాడు. ఈ సినిమా తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లి ఇండియన్ సినిమాకు ఆస్కార్ను పరిచయం చేశాడు.

ఇలా తన సినిమాలతో టాలీవుడ్ స్థాయిని అంతకంతకు పెంచుతూ వెళ్తున్నాడు రాజమౌళి. ఇక ప్రస్తుతం రాజమౌళి తన తర్వాత సినిమాని మహేష్ బాబుతో చేయడానికి రెడీ అవుతున్నాడు జనవరి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.  అయితే దర్శకుడు ధీరుడు రాజమౌళి ఎంతో సాధారణంగా కనిపిస్తూ ఉంటారు.. ఎక్కడ తన దర్జా చూపించాలని అనే ఆలోచన ఎక్కడ ఆయనలో కనిపించదు. అలాంటి రాజమౌళికి కోపం వస్తుందా? నిజంగా ఆయనకు కోపం వస్తే ఏం చేస్తారు? ఈ సందర్భంలో ఆయనకు కోపం వస్తుంది? ఆయన కోపం చూసినవారు ఎవరు? ఈ విషయాలకు క్లారిటీ ఇచ్చారు మన స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్.

ఇక గతంలో త్రిబుల్ ఆర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ రాజమౌళి కోపం గురించి సంచల వ్యాఖ్యలు చేశారు.. రామ్ చరణ్ అక్కడ మాట్లాడుతూ రాజమౌళికి కోపం వస్తే మైకు విరిగిపోతుంది.. ఉసిరి కొడతారని కూడా అన్నాడు.. అదే సమయంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. జక్కన్నకు కోపం వస్తే చేతిలో ఉన్న మైక్ విరిగిపోవటంతో పాటు.. వెంటనే ఓ బూతు వస్తుంది.. జంధ్యాల సినిమాల ఆర్ఆర్ వస్తుంది కదా.. బూతు బూతు బూతు అనే అలా చెవులు మూసుకునేలా ఓ మాట అంటారని ఎన్టీఆర్ అసలు విషయం బయట పెట్టాడు. ఇంత స్టార్ డైరెక్టర్.. అంత ప్రశాంతంగా కనిపిస్తారు.. కాని షూటింగ్ లో భాగా విసిగిస్తే మత్రం  బాగా కోపం వస్తుందట రాజమౌళికి. వెంటనే ఆయన గట్టిగా మైక్ విరిగేలా విసిరేసి.. ఆ బుతు తిడతారట. మరి ఆ బూతు ఏంటో తెలియదు కాని.. ఆ సీక్రేట్ మాత్రం ఎన్టీఆర్ రివిల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: