అనామిక : నయనతార చేసిన ఆ చిన్న తప్పిదమే కొంప ముంచిందా ?

frame అనామిక : నయనతార చేసిన ఆ చిన్న తప్పిదమే కొంప ముంచిందా ?

Veldandi Saikiran
* లేడీ ఓరియంటెడ్ సినిమాలలో రాణిస్తున్న నయనతార
* 2014లో అనామికతో నయనతార సందడి
* శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అనామిక

 టాలీవుడ్ ఇండస్ట్రీలో నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఇండస్ట్రీలో... దూసుకుపోతున్న హీరోయిన్. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిన కూడా... నయనతార క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. ఈ మధ్యకాలంలో ఒక్కో సినిమాకు 7 నుంచి 10 కోట్లు డిమాండ్ చేస్తుంది అంట. అయితే నయనతార కు ఉన్న క్రేజ్ తో దర్శక నిర్మాతలు...  అంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారట.
 అంటే ఒక స్టార్ హీరోకు ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా నయనతార సంపాదిస్తుంది. అయితే అలాంటి నయనతార చేసిన అనామిక సినిమా 2014లో వచ్చిన సంగతి తెలిసిందే. 2014లో వచ్చిన అనామిక సినిమా బాక్సాఫీస్ ముందు మూవీ పెద్దగా పేలలేదు. దీంతో నిర్మాతలకు భారీ నష్టమే వాటిలిందని చెప్పవచ్చు. విదేశాల నుంచి... హైదరాబాద్ కు వచ్చి తన భర్త కోసం వెతుక్కుంటూ... నయనతార.. చేసే ప్రయత్నాలు ఈ సినిమా సారాంశం.
 ఈ తరుణంలో పోలీసులు అలాగే రాజకీయ నేతల నుంచి అనామికకు  అనేక ఇబ్బందులు కూడా వస్తాయి. అయితే.. ఈ స్టోరీ లైన్ బాగున్నా కూడా... నయనతార ఓవర్ యాక్టింగ్  కుంభం వచ్చిందని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఆమె ఓవర్ ఎమోషనల్ సీన్స్ లో నటించే సందర్భంలో   ఫ్లాప్ అయ్యారట. అలాగే సందర్భాన్ని బట్టి ఆమె నటించడంలో.. కాస్త విఫలమైనరని... అప్పట్లో దారుణంగా ట్రోల్లింగ్స్ కూడా వచ్చాయి.
 అయితే 2014 అంటే దాదాపు పది సంవత్సరాల కిందట ఇండస్ట్రీలో నయనతార అప్పుడప్పుడు ఎదుగుతోంది. కాబట్టి ఆమె నటనలో ఇంకా నైపుణ్యత రాలేదు. దానివల్ల చాలా సన్నివేశాలలో ఆమె పర్ఫామెన్స్ పెద్దగా పేలలేదు. అలా కూడా ఈ సినిమా నెగిటివ్ మూడులోకి వెళ్లడం జరిగింది. ఈ శేఖర్ కమ్ముల అలాగే యండమూరి వీరేంద్రనాథ్ లాంటి  ప్రముఖులు పనిచేసిన నయనతార పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీ పెద్దగా పేలలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: