Dulquar Salman: తెలుగులో దుల్కర్ ఆ హీరో స్థానాన్ని భర్తీ చేయనున్నారా..?

Divya
సాధారణంగా ఇతర భాషా ఇండస్ట్రీలకు చెందిన నటులు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ లేదా విలన్ గానూ చేస్తూ సెటిల్ అవుతారు. ముఖ్యంగా అక్కడ హీరోలుగా చలామణి అవుతున్న ఎంతోమంది ఇక్కడ హీరోలుగా సెటిల్ అవ్వడం అనేది చాలా అరుదు. ఒకప్పుడు సిద్దార్థ్ కూడా తెలుగు మీద ఫుల్ ఫోకస్ చేశారు. కాబట్టి ఇక్కడ హీరోగా మంచి స్థానం దక్కించుకున్నారు. బొమ్మరిల్లు సినిమాతో తనను తాను తెలుగు హీరోగా చెప్పుకున్న సందర్భాలు ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా బొమ్మరిల్లు, ఆట, ఓయ్, ఓ మై ఫ్రెండ్ ఇలా ఎన్నో సినిమాలను ఆయన తెలుగులో చేసి మెప్పించారు.
పరభాషా ఇండస్ట్రీకి చెందిన ఈయన ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోగా పేరు దక్కించుకొని,  ఇక్కడే హీరోగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఈయన బాటలోనే మరో మలయాళ హీరో ట్రావెల్ చేస్తున్నారని చెప్పాలి. ఆయన ఎవరో కాదు దుల్కర్ సల్మాన్. అమ్మాడీ  అంటూ మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర పోషించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న ఈయన, ఆ తర్వాత సీతారామం సినిమాతో అందరిని మంత్రముగ్ధుల్ని చేశారు కూడా.. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో  తెలుగు హీరో అయ్యానంటూ ఢంకా భజాయించి చెప్పేశారు ఈ హీరో..  దుల్కర్ సల్మాన్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని , రెండు రోజుల్లోనే రూ.24 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించారు.
ఇక ఇలా ఈ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకొని,  ఇక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కొడుకే దుల్కర్ సల్మాన్.  అక్కడ పలు చిత్రాలలో నటించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈయన.. తెలుగు ప్రేక్షకుల మీద మక్కువతో టాలీవుడ్లోకి అడుగు పెట్టారు. అయితే ఆయన తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తారనే నమ్మకంతో ఇక్కడికి రాగా.. ఆయన నమ్మకం అక్షరాల నిజమయింది.తెలుగు ప్రేక్షకులు ఈయనను పూర్తిగా ఓన్ చేసుకున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: