వామ్మో: పెళ్లికి ముందే ఐశ్వర్యారాయ్ కొడుకును కన్నదా.. ఇదేం ట్విస్ట్..!
ఆ తర్వాత అమితాబచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ తో ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే అభిషేక్ బచ్చన్ కంటే ముందుగానే చాలామంది హీరోలతో డేటింగ్ చేసిందని రూమర్స్ సైతం ఎక్కువగా వినిపించేవి. 2007లో అభిషేక్ బచ్చన్‌ని వివాహం చేసుకోగా.. 2011లో ఆరాధ్య జన్మించింది. ఆరాధ్య కూడా తన తల్లితో పాటు అందాన్ని మెయింటైన్ చేస్తూ అందరిని ఆకర్షిస్తుంది. త్వరలోనే హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇదంతా ఇలా ఉండగా గత కొద్ది రోజులుగా ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారనే రూమర్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం పైన ఎప్పటికప్పుడు ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ఒక సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అదేమిటంటే తాను ఐశ్వర్యరాయ్ కొడుకు నంటూ ఒక వ్యక్తి తెరమీదకి రావడం అందరికీ షాక్ ఇస్తోంది. సంగీత్ కుమార్ అనే వ్యక్తి మీడియా ముందుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇది గడిచిన మూడు సంవత్సరాల క్రితం జరిగిందట.. ఐశ్వర్యరాయ్ కి 15 ఏళ్ల వయసులోనే తాను జన్మించాను అంటూ తెలియజేశారు. అది కూడా ఒక ల్యాబ్ లో జన్మించడం జరిగిందని తెలిపారు. తాను లండన్ లో జన్మించారని వారి పేరెంట్స్ తనని వైజాగ్ తీసుకువచ్చారని.. ఐశ్వర్యరాయ్ తల్లిదండ్రులు తనని పెంచారంటూ కూడా ఆరోపించడం జరిగింది. ఆధారాలు అన్నిటిని చెరిపేసారని చెప్పడంతో చివరికి అతని వివారా అని ఎంక్వయిరీ చేయగా మతిస్థిమితం లేని వ్యక్తి అంటూ పోలీసులు తెలియజేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విడాకుల రూమర్స్ రావడంతో ఈ విషయం మరొకసారి వైరల్ గా మారుతున్నది.