ఆరోజు "మా"ళ్లీ వస్తే ఎంత బాగుండో...!

Thota Jaya Madhuri
గొడవలు ఎవరికైనా వస్తూ ఉంటాయి. ఆ గొడవలను ఎక్స్టెండ్ చేయడం కన్నా ఫుల్ స్టాప్ పెట్టేసుకోవడమే బెటర్ . అప్పుడే మనసు ఆరోగ్యం రెండు ప్రశాంతంగా హెల్తీగా ఉంటాయి . ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలు కారణంగా గొడవలు పడుతూ ఎలా ఫ్యామిలీలో మనస్పర్ధలు తలఎత్తుతున్నాయో చూస్తున్నాం. కేవలం సామాన్య కుటుంబాలు కాదు పెద్ద పెద్ద బడా ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీస్ లు కూడా అలాంటి గొడవలు ఎన్నెన్నో జరుగుతున్నాయి .వాటి కారణంగా చాలా చాలా మంచి రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి .


అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య ఎంత వార్ పిక్స్ కి చేరిందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఓ వైపు రాంచరణ్ ఫ్యాన్స్ మరొకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరొకవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా డివైడ్ అయిపోయి ఒకరి మీద ఒకరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే మళ్లీ రామ్ చరణ్ - అల్లు అర్జున్ కలిస్తే ఎంత బాగుండు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . అందుకు కారణం వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి .


వరుణ్ తేజ్ పెళ్లి జరిగి సంవత్సరం కంప్లీట్ అయింది . ఈ సందర్భంగా వాళ్ళ పెళ్లి వీడియోను రిలీజ్ చేశారు . చాలా హ్యాపీగా మెగా ఫ్యామిలీ పెళ్లి వేడుకలో పాల్గొనింది. ప్రతి ఒక్కరు నవ్వుతూ సరదాగా వయసును మరిచిపోయి నవ్వుతూ చిందులు వేసిన స్టెప్స్ కి సంబంధించిన వీడియో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా రామ్ చరణ్ అదేవిధంగా అల్లుఅర్జున్ కలిసి నాటు నాటు పాటకు స్టెప్స్ వేసినట్లు ఈ వీడియోలో కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి . దీంతో రామ్ చరణ్ అదేవిధంగా బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడు మళ్లీ అలా కలిసి స్టెప్స్ వేస్తారో..ఆ రోజు ఎప్పుడు వస్తుందో..? మీ ఇద్దరు నవ్వుతూ సరదాగా స్టెప్స్ వేస్తారో..? ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  నిజమే గొడవలు అనేటివి సహజం ..అవి ఎక్కడికక్కడ తుడిచిపెట్టుకునేసి కొత్తగా మళ్లీ కలిస్తే బాగుంటుంది అంటున్నారు జనాలు. చూద్దాం మరి  రామ్ చరణ్ - అల్లు అర్జున్ కలిసి ఎప్పుడు మళ్ళీ తెరపై సందడి చేస్తారో..???


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: