భారీగా పెంచేసాడుగా.. అమరన్ కోసం శివ కార్తికేయన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

praveen
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పెరిగే కొద్దీ అటు పారితోషకం కూడా అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఒక సినిమా సూపర్ సక్సెస్ అయింది అంటే చాలు తర్వాత సినిమాకి భారీగా పారితోషకం  డిమాండ్ చేస్తూ ఉంటారు హీరో హీరోయిన్లు. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్ల పారితోషికంకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు ఇటీవలే అమరన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన శివ కార్తికేయన్ పారితోషకం గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారిపోయింది.

 దేశం కోసం ప్రాణాలు అర్పించి వీరమరణం పొందిన మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కింది. అయితే ఈ మూవీలో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ ఆయన భార్య ఇందూ రేబాక వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించారు. ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయగా మంచి ఓపెనింగ్స్ సాధించి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ బాగా కష్టపడ్డాడు. ఎప్పుడూ లేనివిధంగా బాడీ పెంచి ఏకంగా సోల్జర్ లాగా ఫిట్గా మారిపోయాడు. అయితే ఈ సినిమాతో శివకార్తికేయాన్ హిట్టు కొట్టడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

 కాగా ఇక శివ కార్తికేయన్ అమరన్ మూవీ కోసం ఎంత పారితోషకం  తీసుకున్నాడు అన్నది వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్ను ఖర్చు చేశారట నిర్మాతలు. అయితే ఈ మూవీ కోసం శివ కార్తికేయన్ భారీగానే రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడట. అమరన్ మూవీ కోసం సాయి పల్లవి మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే.. శివ కార్తికేయన్ ఏకంగా ఈ సినిమాకి 30 కోట్ల పారితోషికం అందుకున్నాడట. సాధారణంగా ఒక్కో సినిమాకి 15 నుంచి 20 కోట్లు మాత్రమే తీసుకునే శివకార్తికేయన్ ఇక ఈ సినిమాకి 30 కోట్లు అందుకోవడంతో ఇక భారీగానే పారితోషకం పుచ్చుకున్నాడు అంటూ ఒక వార్త వైరల్ మారింది. న్యాచురల్ యాక్టర్ సాయి పల్లవి సినిమాలో ఉన్నప్పటికీ అటు శివ కార్తికేయన్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేసి అదరగొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: