వావ్: క్యూట్ లుక్స్ తో దీపావళి ట్రీట్ ఇచ్చిన 'బేబీ' బ్యూటీ..చూస్తే మతి పోవాల్సిందే బయ్యా..!

FARMANULLA SHAIK
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి హీరోయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న నటి వైష్ణవి చైతన్య.నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసింది.యూట్యూబ్ లో వైష్ణవి చేసే షార్ట్ ఫిల్మ్స్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయాయి. దీంతో తక్కువ సమయంలోనే నెట్టింట ఏ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత ఈ బ్యూటీకి ల్లో చిన్న చిన్న పాత్రలు పోషించే ఛాన్స్ వచ్చింది. తెలుగులో బేబీ తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన వైష్ణవి.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. ఆశిష్ తో లవ్ మీ సినిమా చేసిన వైష్ణవి చైతన్య ఆ సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేసింది.లవ్ మీ ఫ్లాప్ అయినా ప్రస్తుతం అమ్మడి స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాలో నటిస్తుంది.
వైష్ణవి కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి ఎక్కాలంటే జాక్ కంపల్సరీ హిట్ కొట్టాల్సిందే. ఐతే జాక్ సినిమా అప్డేట్స్ ఇంకా రివీల్ చేయలేదు కానీ దీపావళి సందర్భంగా వైష్ణవి నో ఫిల్టర్స్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. కథానాయికలు తమ న్యాచురల్ లుక్ తో కనిపిస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది.ఈ నేపథ్యంలో పండుగలంటే చాలా ఇష్టం పువ్వులు, పూజలతో సెలబ్రేట్‌ చేసుకుందాం అంటూ ఇన్‌స్టా పోస్ట్‌చేసింది.పండుగ రోజు అనవసరమైన మేకప్ ఎందుకు అనుకుందో ఏమో కానీ బేబీ వైష్ణవి చైతన్య న్యాచురల్ లుక్స్ అదిరిపోయింది. పండుగ శోభ అంతా తన ఇంట్లోనే అనేలా అమ్మడు తన లుక్స్ తో ఆకట్టుకుంది. బేబీ వైష్ణవి మాత్రం తన సహజత్వంతో ఆకట్టుకుంటుంది. తన క్యూట్ లుక్స్ తో చూపు మరల్చ లేనంతగా కవ్విస్తుంది వైష్ణవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: