మహేష్ బాబు-నమ్రత : వీరి పెళ్లి ఇంట్లో ఒప్పించి చేసిందేవరంటే..?
•ప్రేమ విషయంపై మీడియా ముందు బట్ట బయలు చేసిన మహేష్ బాబు..
•పెళ్లి తర్వాత భర్త కోసమే కెరియర్ దూరం చేసుకున్న నమ్రత..
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరుపొందిన మహేష్ బాబు, నమ్రత గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రేమించుకొని మరీ వివాహం చేసుకున్న ఈ జంట అటు వెండితెర పైన కూడా హీరో హీరోయిన్లుగా రాణించారు. మొదట వంశీ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు నెల రోజులపాటు న్యూజిలాండ్‌లో జరిగిందట. ఆ సమయంలోనే మహేష్ - నమ్రత మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహమే ప్రేమగా మారిపోయింది.
సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను మీడియాకు తెలియజేయడానికి చాలామంది మక్కువ చూపరు.. కానీ మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి పది విషయాలు తెలిపారు. సుమారుగా నాలుగేళ్ల పాటు ప్రేమించుకుని మరీ ఎంజాయ్ చేసి చివరికి తమ ఇంట్లో చెప్పేసారట. అయితే వీరి పెళ్లికి మహేష్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల ముందుండి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసిందట. అలా చాలా సింపుల్ గానే ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో 2005 ఫిబ్రవరి 10వ తేదీన వీరి వివాహం జరిగిందట.
వివాహం అనంతరం నమ్రత సినిమాలకు దూరమై.. కేవలం మహేష్ బాబు బిజినెస్ లను సినిమాలను పిల్లలను మాత్రమే చూసుకుంటూ కాలాన్ని గడిపేస్తోంది. ఎన్నోసార్లు సమయం వచ్చినప్పుడల్లా తమ ప్రేమ విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఈ జంట. ఇక మహేష్ నమ్రతకి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా అటు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడమే కాకుండా.. సేవా కార్యక్రమాలు చేయడానికి వరుసలో ఉంటారు. మహేష్ బాబు అంటే తన తండ్రికి చాలా నమ్మకం అని , అందుకే తను ఏం చేసినా కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటారని కుటుంబానికి బాగా తెలుసు అని అందుకే పెళ్లి విషయంలో కూడా చెప్పగానే ఒప్పేసుకున్నారని తెలిపారు.