ప్రేమకు సరికొత్త అర్థం చెప్పిన చైసామ్ జోడీ.. విడిపోయినా ఆ విషయంలో గ్రేట్!
ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత దాదాపుగా నాలుగేళ్ల పాటు కలిసి ఉండి ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ విడుదలైన కొన్నిరోజుల తర్వాత చైసామ్ విడాకులకు సంబంధించిన ప్రకటన వెలువడింది. అయితే విడిపోయినా విడాకుల విషయంలో బహిరంగంగా ఒకరినొకరు చైసామ్ నిందించుకోలేదనే సంగతి తెలిసిందే.
ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ సమంతతో గడిపిన దశను తాను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. కలిసున్నా విడిపోయినా ఈ జోడీ ప్రేమకు సరికొత్త అర్థం చెప్పారు. విడాకుల తర్వాత కూడా ఈ జోడీ కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో పాటు వరుస విజయాలను అందుకుంటున్నారు. చైతన్య సమంత రాబోయే రోజుల్లో ఒకే వేదికపై కలిసి కనిపించే అవకాశాలు సైతం తక్కువేనని చెప్పవచ్చు.
నాగచైతన్య త్వరలో రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెల 4వ తేదీన చైతన్య శోభిత పెళ్లి జరగనుంది. చైతన్య శోభిత పెళ్లి గ్రాండ్ గా జరగనుందని సమాచారం అందుతోంది. ఈ పెళ్లి వేడుక కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత నాగచైతన్య తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగచైతన్య సినిమాల బడ్జెట్ ఒకింత భారీ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. తండేల్ సినిమా కోసం ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.