చైతూ-శోభితా ప్రేమ మధురమే....కానీ సమంత జీవితమే నాశనం ?
ఇదిలా ఉండగా... సమంత, నాగచైతన్య 2017 లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో అంగరంగ వైభవంగా వారి వివాహాన్ని జరిపించుకున్నారు. వివాహ అనంతరం ఎంతో అన్యోన్యంగా కొనసాగిన వారి వైవాహిక జీవితం అతి తక్కువ సమయంలోనే ముగింపు పలికింది. ఏవో గొడవల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరు 2021లో విడాకులు తీసుకున్నారు.
అయితే విడాకుల అనంతరం నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ అప్పటి నుంచే సీక్రెట్ గా వారి ప్రేమను కొనసాగిస్తున్నారు. బయట కొన్ని సందర్భాలలో కెమెరా కంట చిక్కినప్పటికీ వారి ప్రేమ విషయాన్ని అసలు బయట పెట్టలేదు. ఎట్టకేలకు ఆగస్టు 8వ తేదీన అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక వీరి వివాహం డిసెంబర్ లేదా ఫిబ్రవరి నెలలో జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట.
ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించి పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం అందుతుంది. విదేశాలలో వీరి వివాహాన్ని జరిపించాలని ప్లాన్ లో ఉన్నారట. ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిపించినందు వల్ల వీరి వివాహాన్ని గ్రాండ్గా జరిపించాలని కుటుంబ సభ్యులు ప్లాన్ లో ఉన్నారట. విడాకుల తర్వాత సమంత ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఒకానొక సమయంలో సమంత తన ప్రేమ గురించి చెబుతూ ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నామని చెప్పింది. తన జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదని వెల్లడించింది.