ఏపీలో ఫ్రీ బస్ అమలు సులువు కాదా.. హామీ అమలుకు అసలు సమస్యలివే!

Reddy P Rajasekhar
ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక పథకాలను అమలు చేసిన ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీమ్ ను సైతం వేగంగా అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏపీలో ఫ్రీ బస్ అమలు సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఈ స్కీమ్ అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
 
అందువల్ల ఏపీలో ఈ స్కీమ్ ను అమలు చేస్తారా లేదా అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. కూటమికి ఈ పథకం అమలు సక్సెస్ కావడం ఎంతో కీలకం కాగా ఈ పథకం అమలు చేయాలంటే కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆటో డ్రైవర్లు బాధ పడకుండా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.
 
ఏపీలో హామీల అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అధ్యయనం మొదలుపెట్టారని భోగట్టా. ఫ్రీ బస్ స్కీమ్ విషయంలో ప్రజల్లో సైతం భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. మరికొన్ని నెలల పాటు ఈ స్కీమ్ గురించి టీడీపీ నేతలు స్పందించే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది. ఫ్రీ బస్ స్కీమ్ విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.
 
ఫ్రీ బస్ స్కీమ్ అమలులోకి వస్తే మహిళలకు ఎంతో బెనిఫిట్ కలుగుతుంది. అయితే ఈ స్కీమ్ అమలుకు సంబంధించి టీడీపీ నేతలు స్పందించే వరకు ఆగాల్సిందే. ఫ్రీ బస్ స్కీమ్ అమలు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. హామీల అమలు విషయంలో బాబు నిర్ణయాలు ఎలా ఉండనున్నాయో చూడాలి. ఫ్రీ బస్ స్కీమ్ అమలు వల్ల కొన్ని కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: