మహేష్ సినిమాపై కేరళవాసుల రియాక్షన్ అదేనంటున్న కృష్ణతేజ ఐఏఎస్..!
ఐఏఎస్‌లో చేరిన తర్వాత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, నాణ్యమైన విద్య వంటి అంశాలపై దృష్టి పెట్టారు. ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ధ్యేయం.ఇదిలావుండగా బాలల హక్కుల రక్షణలో త్రిస్సూర్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. దీంతో ఐఏఎస్ అధికారిగా ఆయన చేసిన కృషికిగాను జాతీయ బాల రక్షణ కమిషన్ పురస్కారం అందుకున్నారు.ఇదిలావుండగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షించే శాఖల్లో కృష్ణతేజ పనిచేస్తారు.కేరళ నుంచి ఏపీకి మూడేళ్ల పాటు డిప్యూటేషన్‌కు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ను ఆయన కలిశారు. సుపరిపాలన కోసం సమర్థులైన ఐఏఎస్‌లను చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చారు.
తాజాగా కృష్ణతేజ ఓ ఇంటర్వ్యూలో కేరళ పరిపాలనపై మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేరళలో పంచాయతీ ప్రెసిడెంట్.. పంచాయతీ సీఎం, మున్సిపాలిటీ ప్రెసిడెంట్.. మున్సిపాలిటీ సీఎం.. అంటే వాళ్లకు ఫుల్ పవర్స్ వుంటాయి. మున్సిపాలిటీ ప్రెసిడెంట్ సీఎం హోదాలో వుంటారు. అక్కడ స్టాండింగ్ కమిటీ ఎడ్యుకేషన్ ఛైర్మన్ వుంటారు. ఆయన ఆ మున్సిపాలిటీకి విద్యాశాఖ మంత్రి హోదా రేంజ్‌లో వ్యవహరిస్తారు.అలాగే స్టాండింగ్ కమిటీ హెడ్ వుంటారు. ఆయన కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తారు. అలా మినీ గవర్నమెంట్ అనేది పంచాయతీ స్థాయి నుంచే కేరళలో రన్ అవుతూ వుంటుంది. కేరళ ప్రత్యేకతలు అంటే ఏమీ లేదు.. భరత్ అనే నేను మూవీలో మహేష్ బాబు ఎలాంటి పాలన చేశారో.. అదంతా 95లోనే కేరళలో చేశారు.అందుకే భరత్ అనే నేను మూవీని ఏ స్టేట్ వాళ్లు చూసినా సూపర్ అంటారు. అయితే కేరళ వాళ్లు చూస్తే కామ్‌గా ఏంటిది అంటూ ప్రశ్నిస్తారని కృష్ణతేజ అన్నారు. దీనిని బట్టి కేరళలో రాజకీయ నేతలు, ప్రజలకు ఏ రేంజ్‌లో సాయం చేస్తారో. ప్రజలు కూడా రాజకీయ నేతలకు అదే తరహాలో సపోర్ట్ చేస్తారని.. రాజకీయ నాయకులకు, ప్రజలకు అక్కడ సమన్వయం వుంటుందని చెప్పారు కృష్ణతేజ అన్నారు.