మెగాస్టార్ సినిమాలో బాలయ్య వారసుడు నటించినట్లు మీకు తెలుసా.?

FARMANULLA SHAIK
బాలయ్య అంటే ఈ రోజుల్లో నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ మన్నవ బాలయ్య అనే సీనియర్ నటులు ఉన్నారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత ఇలా తన బహుముఖ ప్రజ్ఞతో చిత్రసీమకు సేవలందించారు యమ్.బాలయ్య. అందరివాడుగా, అందరికీ తలలో నాలుకలా ఉంటూ అతి సౌమ్యునిగా పేరొందారు యమ్.బాలయ్య. ‘అమృత ఫిలిమ్స్’ పతాకంపై తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించారు. కొన్నిటికి దర్శకత్వమూ వహించారు. వందలాది చిత్రాలలో కేరెక్టర్ యాక్టర్ గా నటించి మెప్పించారు.ఇదిలావుండగా ఈ తరం ప్రేక్షకులకు ఆయన ఓ తాత రూపం గానే తెలుసు. అదేనండి ఆయన మరెవరో కాదు మల్లీశ్వరి లో కత్రినా కైఫ్ కు తాత గా, మన్మధుడు లో నాగార్జున కు తాత గా చేసారు.ఈ నేపథ్యంలో ఇప్పటి తరం ఆడియన్స్ కి ఆయన కేవలం ఈ రెండు సినిమాల ద్వారానే సుపరిచితం. కానీ ఆయన సీనియర్ మోస్ట్ నటుడు, డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, నిర్మాత. 1953 వ సంవత్సరంలో ఆయన ‘ఎత్తుకి పై ఎత్తు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

 అలా ప్రారంభమైన మన్నవ బాలకృష్ణ సినీ ప్రయాణం హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా కలిపి 350 కి పైగా సినిమాల వరకు సాగింది. 1930 వ సంవత్సరంలో జన్మించిన ఈయన 2022 వ సంవత్సరంలో ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాసని విడిచాడు. ఈయన వారసుడు కూడా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు. అతని పేరు హరి కృష్ణ. ఈయన సీరియల్స్ లో స్టార్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో భారీ హిట్ గా నిల్చిన ‘గృహ లక్ష్మి’ సీరియల్ లో హీరో గా నటించింది ఈయనే. ‘నందు’ క్యారక్టర్ లో ఆయన జీవించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. ఆ తర్వాత ఈయన ఈటీవీ లో ప్రసారమయ్యే ‘మౌన పోరాటం’, స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘పలుకే బంగారమాయే’ వంటి సీరియల్స్ లో నటించాడు. రీసెంట్ గానే ఈయన జెమినీ టీవీ లో కూడా ఒక కొత్త సీరియల్ లో నటించడానికి ఒప్పుకున్నాడు. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న హరి కృష్ణ ఈమధ్య కాలంలో సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో కూడా ఈయన్ని మనం గమనించొచ్చు.ఈ నేపథ్యంలో హరికృష్ణ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నాకు బాలయ్య తాత బ్యాగ్రౌండ్ ఉన్నాసరే నేను ఆయన సపోర్ట్ తీసుకోలేదు. మన కష్టంతో మనం పైకి రావాలనేది నా అభిప్రాయం. స్విమ్మింగ్ రాకుండా దిగితే ఎంత ప్రమాదమో యాక్టింగ్ రాకుండా ఈ ఫీల్డ్‌లోకి వస్తే ఏమీ చేయలేం. అందుకే యాక్టింగ్ నేర్చుకోవడానికి కాస్త టైం పట్టింది. సో కష్టపడ్డాను కానీ ఇష్టంగానే కష్టపడ్డా అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: