ఆ నటుడి కోపానికి బలైన త‌మ‌న్నా.. అందుకే ప్రేమించిన హీరోకు దూర‌మైందా..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ గత రెండు దశాబ్దాలుగా తిరుగులేని హీరోయిన్గా కొనసాగుతోంది. అందివ‌చ్చిన అవకాశాలు అన్ని అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన తమన్నా ఇప్పుడు టాలీవుడ్ లో వెంకటేష్ - చిరంజీవి లాంటి సీనియర్ హీరోల పక్కన మంచి హీరోయిన్గా కనిపిస్తున్నారు. సీనియర్ హీరోలకు తమన్నా బెస్ట్ ఆప్షన్ అయిపోయారు. ఇటు వెండి తెరతో పాటు అటు బుల్లి తెరపై పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయవర్మతో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇదిలా ఉంటే తమన్నా గతంలో ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడింది. ఈ విషయం అప్పట్లో అందరికీ తెలుసు. అయితే ఓ నటుడు కారణంగా తమన్న ఆ స్టార్ హీరోకు దూరమైంది.

ఆ నటుడు ఎవరో ? కాదు తమిళ హీరో కార్తీ తమన్నా కలిసి ఆవారా సినిమాలో నటించారు. అది సూపర్ డూపర్ హిట్ అయితే కోలీవుడ్లో హీరో కార్తీ తండ్రి నటుడు శివకుమార్ కార్తీ - తమన్నా పెళ్ళికి అసలు ఒప్పుకోలేదట. దానికి కారణం కార్తీకం అంటే ముందు కార్తీ అన్నయ్య నటుడు సూర్య జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తనకు ఇష్టం లేకపోయినా తన ఇంటి కోడలు అయింది ఆ తర్వాత తన రెండో కుమారుడు అయిన కార్తీక్ కూడా మళ్లీ హీరోయిన్ భార్యగా రావటం తన ఇంటికి కోడలి గా రావడం శివకుమార్ కు ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే శివకుమార్ కార్తీకి తన సొంత మేనకోడలి తో పెళ్లి జరిపించారు. అలా శివకుమార్ కారణంగా కార్తీ - తమన్నా బ్రేకప్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: