అప్పుడు లావణ్య త్రిపాఠి ..ఇప్పుడు శోభితా ధూళిపాళ్ల.. పెళ్ళికి ముందే అత్తగారింట్లో అలాంటి పనులా..?
శోభిత ధూళిపాళ్ల చాలా ట్రెడిషనల్ గా చీర కట్టుకొని మెరిసి పద్ధతిగల అమ్మాయి అని అందరి చేత అనిపించుకుంది. అందాల దేవ కన్యలా మెరిసి అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేసింది . కాగా పెళ్లికి ముందే అక్కినేని నాగార్జున అక్కినేని ఇంటి కోడలు హోదా శోభిత ధూళిపాళ్ళకి కట్టబెట్టడంపై చాలామంది జనాలు మండిపడ్డారు . మా సమంత విషయంలో ఈ తెగింపు ఏమైంది అంటూ ఫైర్ అవుతున్నారు.
సమంత కంటే ఆ శోభిత ధూళిపాళ్ల అంత అందగత్తేనా..? అంటూ ఘాటుగా కూడా స్పందించారు . అయితే మరొకసారి శోభిత ధూళిపాళ్లను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . నేడు దీపావళి . ఈ సందర్భంగా కాబోయే కొత్త కోడలితో ఇంట్లో పూజ చేయిస్తున్నాడట అక్కినేని నాగార్జున . నిజానికి మూడు ముళ్ళు పడకుండా ఇలా పూజ చేయించడం మన సాంప్రదాయం కాదు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఎందుకో శోభిత ధూళిపాళ్లతో ముందుగానే ఇలా లక్ష్మీదేవి పూజ చేయిస్తున్నారట . అంతేకాదు లావణ్య త్రిపాఠి సైతం గతంలో పెళ్లి కాకముందే నిశ్చితార్థమైన తర్వాత వరుణ్ తేజ్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది . పీఠల మీద కూర్చుని పూజ కూడా చేసింది. ఆ తర్వాత ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చేసుకుంది . లావణ్య త్రిపాఠిలాగే శోభిత ధూళిపాళ్ల కూడా పెళ్లికి ముందే అత్తగారింట్లో స్పెషల్ పూజలు చేసేస్తుంది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు..!