ఏంటి.. ఈ తెలుగు స్టార్ సింగర్ కు దివంగతి హీరో ఉదయ్ కిరణ్ కు ఉన్న లింకు ఇదే..!

Amruth kumar
టాలీవుడ్ దివంగత హీరో ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అందరిలో కలుగుతుంది.. మన కుటుంబ సభ్యుడు మనకు బాగా తెలిసినవాడు అనే భావన మనలో కనిపిస్తుంది. అదేవిధంగా తెలియకుండానే మన కళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తాయి. స్టార్ హీరోగా టాలీవుడ్ లో రాణించాల్సిన ఉదయ్‌ అనుకోని విధంగా తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు. చిత్రం సినిమాతో హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ వరుస‌ సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుని భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా లవర్ బాయ్ గా చాక్లెట్ బాయ్ అని ఇమేజ్ను తెచ్చుకున్నాడు. వరుసగా చిత్రం , నువ్వు నేను , మనసంతా నువ్వే , కలుసుకోవాలని సినిమాలతో ప్రేక్షకులు మన‌సులో నిలిచిపోయాడు. అంతేకాకుండా అమ్మాయిలకు కలల రాకుమారుడు గా మారిపోయాడు.

వరస విజయాలతో దూసుకుపోతున్న ఉదయ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది కెరియర్ పిక్ లో ఉండగానే ఉదయ్ పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి అంతా బాగుంది అనుకునేలోగా ఉదయ్ కెరియర్ అనుకోని విధంగా డల్ అయింది. అతనికి సినిమాలు తగుకుంటూ వచ్చాయి చేసిన సినిమాలు కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ఉదే తన ఫెయిల్యూర్ ని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని విడిచి కొన్నేళ్లు అవుతున్న కూడా ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

అయితే ఉదయ్ కిరణ్ కి టాలీవుడ్ లో ఒక చెల్లి కూడా ఉంది.. అయితే ఆమె ఇప్పుడు స్టార్ సింగర్ అనే విషయం చాలామందికిి తెలియదు.. ప్రస్తుతం సింగర్ గా పాన్ ఇండియా లెవెల్ లో రాణిస్తున్నారు ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు పర్ణిక మన్య .. ఈమె సరిగమ షో ద్వారా సింగర్ గా కెరియర్ను మొదలుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్లో పాడింది. పరారే, బ్రహ్మనందం డ్రామా కంపెనీ, తెలుగమ్మాయి, బాడీ గార్డ్, దేనికైనా రెడీ, గ్రీకు వీరుడు, బాహుబలి, రభస, కవచం, భీమ్లా నాయక్ ... ఇలా చాలా సినిమాల్లో పాటలు పాడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు చేస్తోంది. కాగా ఉదయ్ కిరణ్ పర్ణికకాకు కజిన్ బ్రదర్ అవుతాడు. ఉదయ్ తనకు పెద్దమ్మ కొడుకు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక పర్ణిక తండ్రి కూడా నటుడే.. ఆయన పేరు మన్య భాస్కర్. పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించాడు. ఉదయ్ కిరణ్ పేరును నేను ఇండస్ట్రీలో ఎక్కడ ఉపయోగించుకోలేదు. ఉదయ్ కూడా కష్టపడి వచ్చాడు. ఉదయ్ చిన్నప్పటి నుంచి ఎంతో తక్కువ మాట్లాడేవాడు. చాలా మంచోడు.. కానీ అతని అలా అవ్వడం చాలా బాధాకరం అని అన్నారు పర్ణిక .



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: