జ‌గ‌న్ ఇక ఒంట‌రే.. అమ్మ‌, చెల్లి దూరం... భార్య‌తోనే ప్ర‌యాణం...!

RAMAKRISHNA S.S.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి ఆశ కూడా పోయింది.. ఆఖరి మేకు కూడా దింపేశారు జగన్ తల్లి వైయస్ విజయలక్ష్మి. తన బిడ్డల ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని జరగాల్సిన ఆస్తులు పంపిణీ విధానాన్ని విజయలక్ష్మి క్లియర్గా లేఖ రూపంలో బయటపెట్టారు. దాని ప్రకారం చూసుకుంటే 40 శాతం ఆస్తులు షర్మిలకు పంచి ఇవ్వటానికి జగన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. పైగా ఆస్తులు పంపకం ఆలోచన అన్నది జగన్ దే అన్న‌ట్టుగా క‌న‌ప‌డుతోంది. క‌ర్నాట‌క లోని ఎలహంక ప్రాపర్టీ మొత్తం షర్మిల దే అంట. ఇంకా చాలా అస్తులు షర్మిలోకి ఇవ్వాలి. రు. 200 కోట్ల డివిడెంట్ ఇవ్వడం అన్నది వాస్తవమే .. అదే సమయంలో జగన్ కూడా 200 కోట్లకు పైగా డివిడెంట్ తీసుకున్నారట.

ఇప్పుడు వైఎస్ కుటుంబంలో అందరూ షర్మిల వైపు ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది. కేవలం వైఎస్ జగన్ , జగన్ భార్య భారతి రెడ్డి , జగన్ బాబాయ్ వై.వి సుబ్బారెడ్డి మాత్రమే జగన్ కు మిగిలిన బంధువులు అనుకోవాలి. ఈ లెక్కన చూస్తే వైఎస్ ఫ్యామిలీ అంతా ఒకవైపు ఈ ముగ్గురు ఒకవైపు అన్నట్టుగా కనిపిస్తోంది. చివరకు తల్లి ... చెల్లి ఒకటి అయిపోయారు. ఇప్పుడు జగన్ కుటుంబంలో ఒంటరి వారు అయిపోయారు. జగన్ బాగా కార్నర్ అయిపోయారు. త‌ల్లి ఇలా లేఖ రాయడంతో కుటుంబంలో పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎవరైనా తెగిస్తే చేసేదేమీ లేదు షర్మిల ఆస్తుల కోసం పూర్తిగా తెగించారు అన్న ఏమైనా అన్న పార్టీ ఏమైనా అన్న రాజకీయ భవిష్యత్తు ఏమైనా తనకు అనవసరం.. తనకు ఆస్తులు పంపిణీ విషయంలో అన్యాయం జరిగింది అని ఆమె రచ్చ కెక్కేశారు.

ఈ విషయంలో ఆమె తాడోపేడో తేల్చుకునేందుకు ఎంత మాత్రం వెనకట్టడం లేదు. ఇక అటు తల్లి విజయలక్ష్మి కూడా షర్మిలారెడ్డి వైపు ఉండడంతో ష‌ర్మిల‌ ఇంకా రెచ్చిపోతున్నారు. ఇవన్నీ జగన్ ను బాగా డిఫెన్స్ లో పడేస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ పార్టీ కష్టాల్లో ఉంది. ఇటు పార్టీని నడిపించడంతో పాటు అటు కుటుంబంలోనూ ఏటికి ఎదురీదుతూ ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: