రివ్యూ: అమరన్ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా..?
సినిమా కథ విషయానికి వస్తే.. ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందినటువంటి ఇండియన్ ఆర్మీ అధికారిక ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత ఆధారంగా తీశారు.. వరదరాజన్ (శివ కార్తికేయన్) నటించాగా అతని భార్య హిందు రెబక్క (సాయి పల్లవి) నటించింది. 2014 ఏప్రిల్ 25న దక్షిణ కాశ్మీర్ లోని ఒక గ్రామంలో ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ముకుంద్ వీరమరణం పొందారు. అయితే ఇది కేవలం బయట ప్రపంచానికి మాత్రమే తెలుసు కానీ ఆయన ఆర్మీ లోకి ఎలా వచ్చారు ఆ తర్వాత కేరళ యువతిని ఎలా వివాహం చేసుకున్నారు.. వీరి జీవితంలో ఏర్పడిన సమస్యలు ఏంటి?. ఈయన 44 రైఫిల్ చితా విభాగానికి అందించిన సేవలు ఏంటి అనే విషయం పైన ఈ సినిమా కథను తీశారు.
ఏదైనా బయోపిక్ తీయాలన్నా కూడా డైరెక్టర్ లకు అది చాలా కష్టమని చెప్పవచ్చు.. 2014లో కాశ్మీర్లో ఉగ్రవాదలతో పోరాడి వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వీరమరణం పొందారు... కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మొదటి భాగం అంతా ముకుంద్, ఇందులో లవ్ స్టోరీ తో పాటు ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య జరిగే సన్నివేశాలను చూపించారు. ఇండియన్ ఆర్మీలో చేరిన ముకుంద్ అంచలంచలుగా మేజర్ స్థాయికి ఎలా ఎదిగారనే విషయాన్ని చాలా గొప్పగా చూపించారు. ఇక రెండవ భాగంలో ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టారు అనే విషయాన్ని చూపించారు. ఇందులో కొంతమేరకు కాస్త కథను సాగదీసినట్టుగా అనిపిస్తుందట.
2014 ఏప్రిల్ 25న.. టెర్రరిస్టులను అర్థం చేయడానికి చేపట్టిన ఖాసీపత్రి ఆపరేషన్ ని ముకుంద్ ఎలా విజయవంతం చేశారనేది చూపించారు. విచిత్రంలోని ఎమోషనల్ సన్నీవేషాలు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయట. సాయి పల్లవి, శివ కార్తికేయని మధ్య వచ్చే సన్నివేశాలు అందరి హృదయాలను తాకేలా ఉంటాయి.
ఈ చిత్రానికి ప్రధాన బలం శివ కార్తికేయన్, సాయి పల్లవి నరసరావుపేట, ఇందులో వీరి పాత్రలలో ఎవరికి వారు జీవించేశారు. చిత్ర బృందం పడిన కష్టమంతా తెర పైన చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇందులో సంగీతం ప్రధాన బలం. మొత్తానికి అమరన్ సినిమా ఒక ఎమోషనల్ రైడ్ సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.