కిర్రాక్ ఆర్పీ 2 కోట్లతో ప్లాన్ చేసాడు.. ప్లాన్ మాములుగా లేదుగా?
ఇక ప్రారంభంలో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగినప్పటికీ, ఆ తరువాత క్రమంలో ఆర్పీ చేపల పులుసు సెంటర్లపై విమర్శలు మొదలయ్యాయి. ధరలు మరీ ఎక్కవగా ఉన్నాయంటూ కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన క్వాలిటీ, క్వాంటీటీకి తగ్గట్టుగానే ధరలు ఉన్నాయని, ఇష్టమున్న వాళ్లు తినొచ్చని, లేకుంటే లైట్ తీసుకోవచ్చంటూ కిర్రాక్ ఆర్పీ సమాధానం చెప్పుకొచ్చాడు. ఇక ఆ తరువాత కిర్రాక్ ఆర్పీ రాజకీయ వేదికలపై అడుగుపెట్టి వైఎస్సారీసీపీ నాయకులపై సంచలన కామెంట్స్ చేస్తూ సూపర్ పాపులర్ అయ్యాడు. ఈ సంగతి కాస్త పక్కన పెడితే… ఇప్పుడు మరో కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు మన కిర్రాక్ ఆర్పీ.
అవును, త్వరలో మణికొండలో ఏకంగా రూ. 2 కోట్లతో రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాడు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్పీనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. "మంచి ప్లానింగ్, మంచి ఆర్చిటెక్చర్ తో మణికొండలో రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాను. దీనికి సంబంధించి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. నెక్ట్స్ మంత్ ఎండింగ్ కల్లా రెస్టారెంట్ ఓపెన్ చేస్తాము. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు విషయంలో నాకు ఏదైతే అనుభవం అయ్యిందో ఆ అనుభవం ఆధారంగా మరింత పకడ్బందీ ప్రణాళికతో ఈ సారి రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నాను!" అంటూ కిర్రాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు. దాంతో కిర్రాక్ ఆర్పీకి సోషల్ మీడియాలో ఓ వర్గం శుభాకాంక్షలు తెలిపారు.