సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. టాలెంట్ కు వావ్ అనాల్సిందే!
రాజమౌళి తన ప్రతిభతో అంతకంతకూ ఎదిగి ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. రాజమౌళి తాను కొన్ని షాట్స్ ను కాపీ కొట్టడం నిజమేనని వాటిలో కొన్ని ఒరిజినల్ కంటే బెటర్ గా ఉంటే మరికొన్ని ఒరిజినల్ కంటే చెత్తగా ఉంటాయని చెప్పుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి భిన్నమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారనే చెప్పాలి.
సినిమా సినిమాకు జానర్ విషయంలో మార్పులు చేస్తున్న జక్కన్న మహేష్ సినిమాను అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ మూవీకి కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు వచ్చిన నేపథ్యంలో జక్కన్న మరింత జాగ్రత్త పడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జక్కన్న మహేష్ సినిమా కోసం ఐదేళ్ల సమయం కేటాయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
ఈ సినిమాను రాజమౌళి ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ను సొంతం చేసుకోవడంతో పాటు తన సినిమాలతో క్రిటిక్స్ మెప్పు పొందిన డైరెక్టర్ గా రాజమౌళికి పేరుంది. జక్కన్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. రాజమౌళి రెమ్యునరేషన్ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నా అధికారికంగా వాటిని మాత్రం జక్కన్న రివీల్ చేయడానికి ఎప్పుడూ ఇష్టపడరు. అయితే టాలీవుడ్ లో ఆయన స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న మరో దర్శకుడు మాత్రమే లేరనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.