మహేశ్ బాబు పై అలాంటి ప్రశ్న..నాటీ కామెంట్స్ చేసిన రాజమౌళి..ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!

Thota Jaya Madhuri
మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . తండ్రి పెద్ద సూపర్ స్టార్ హీరో అయినప్పటికీ ఆయన పేరుని ఉపయోగించుకోకుండా చాలా చాలా కష్టపడుతూ టాలెంట్ తో పైకి ఎదిగాడు.
 కాగా ఇప్పుడు ఆయన గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా చాలా కష్టపడుతున్నాడు. మనకు తెలిసిందే మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.
ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది నెలల నుంచి బాగా కష్టపడుతున్నాడు.  దాదాపు పది కేజీలకు పైగానే బరువు తగ్గి లుక్స్ మొత్తం మార్చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం కూడా జంగిల్ అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందట . అంతేకాదు ఏఐని ఈ చిత్రం కోసం బాగా వాడుతున్నారట . అంతేకాదు ఈ క్రమంలోనే రాజమౌళి దానిపై స్పెషల్ కోచింగ్ కూడా తీసుకుంటున్నారట .ఎస్ ఎస్ ఎం బి 29 జంగల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారట . కాగా ఇదే మూమెంట్లో రాజమౌళి ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .
"తను చాలా చాలా హ్యాండ్సం హీరో మాత్రమే కాదు అని డెడికేషన్ హీరో కూడా అని" చెప్పుకు రావడమే కాకుండా .హోస్ట్ అడిగిన ప్రశ్నకు చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు. మహేష్ బాబు నటించిన సినిమాలలో మీ ఫేవరెట్ ఏంటి ..? అని అడగ్గా ఆయన ఓపెన్ గా ఆన్సర్ చెప్పారు . "మహేష్ బాబు నటించిన సినిమాలలో ఒక్కడు సినిమా అంటే తనకు చాలా ఇష్టమని ..ఆ సినిమాలో మహేష్ బాబు పర్ఫామెన్స్ ఇంకా బాగుంటుంది అని చెప్పడమే కాకుండా "పోకిరి" సినిమా అయితే నేను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. "పోకిరి" అలాగే "ఒక్కడు" సినిమా ఆయన ది మోస్ట్ ఫేవరెట్ " అంటూ చెప్పుకు రావడం ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరింత హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది . అంతేకాదు  పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ అప్పుడప్పుడు నేను కూడా సరదాగా ఇంట్లో వాడుతూ ఉంటానని చెప్పి  నవ్వులు పూయించాడు ఎస్ఎస్ రాజమౌళి. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: