NBK 109 : నిర్మాత కాన్ఫిడెన్స్ తో ఆనందంలో ఫ్యాన్స్.. ఆ ఒక్క మాటతో బ్లాక్ బస్టర్ వాతావరణం..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ను ఇప్పటివరకు మేకర్స్ అనౌన్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలయ్య కెరియర్లో 109 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ లో బాలయ్య సరసన ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఏ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను జనవరి 9 వ తేదీన గాని లేదా 12 వ తేదీన కానీ విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా ఈ సినిమా యొక్క టైటిల్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఈయన బాలయ్య , బాబీ కాంబోలో పొందుతున్న సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని , అందులోని చాలా సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి అని , బాబి కెరీర్ లోనే టాప్ మూవీ గా బాలయ్య సినిమా ఉండబోతుంది అని ఆయన తెలియజేశాడు. ఇలా బాలయ్య సినిమా సినిమా గురించి నాగ వంశీ చెప్పడంతో బాలయ్య అభిమానులు ప్రస్తుతం ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: