ఈతరం ప్రేక్షకులను మెప్పించడంలో కృష్ణవంశీ ఫెయిల్.. అలా చేయడమే మైనస్!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించే విషయంలో కృష్ణవంశీకి ఎవరూ సాటిరారనే సంగతి తెలిసిందే. ఈ దర్శకుడి డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఆర్జీవీ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కృష్ణవంశీ గులాబీ సినిమా సక్సెస్ తో కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
 
నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, మురారి, ఖడ్గం సినిమాలతో మెప్పించిన ఈ దర్శకుడు తర్వాత రోజుల్లో రాఖీ, చందమామ సినిమాలతో ఆకట్టుకున్నారు. మహాత్మ సినిమా హిట్ గా నిలిచినా ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అని చాలామంది ఫీలవుతారు. రామ్ చరణ్ తో కృష్ణవంశీ తెరకెక్కించిన గోవిందుడు అందరివాడేలే బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
 
రంగమార్తాండ సినిమాకు ప్రశంసలు దక్కినా ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన రేంజ్ ను అందుకోలేదు. కృష్ణవంశీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావడం లేదు. కృష్ణవంశీ క్రేజ్ ను పెంచుకుని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కృష్ణవంశీ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. భారీ సక్సెస్ సాధిస్తే ఈ దర్శకుడికి కొత్త ఆఫర్లు వస్తాయి.
 
కృష్ణవంశీ ఈతరం ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకుంటే భారీ విజయాలు దక్కే అవకాశాలు అయితే ఉంటాయి. కృష్ణవంశీకి పూర్వ వైభవం దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కృష్ణవంశీ తన సినీ కెరీర్ లో ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే సినిమాలను ఎక్కువగా తెరకెక్కించడం జరిగింది. కృష్ణవంశీ టాలెంట్ కు తగ్గ హిట్ ఈ మధ్య కాలంలో అయితే దక్కలేదని చెప్పవచ్చు. 2025 సంవత్సరం అయినా కృష్ణవంశీ కెరీర్ కు కలిసిరావాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కృష్ణవంశీ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: