ఒకప్పుడు మెప్పించి ఇప్పుడు నొప్పిస్తున్న పూరీ జగన్నాథ్.. ఆ తప్పులు గమనించట్లేదా?
చిరుత సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ సక్సెస్ రేట్ తగ్గినా బిజినెస్ మేన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు పూరీ కెరీర్ కు ప్లస్ అయ్యాయి. అయితే గత పదేళ్లలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి. ఒకప్పటి పూరీ సినిమాలకు ఇప్పటి పూరీ సినిమాలకు పొంతనే లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు పూరీ జగన్నాథ్ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేశాయి. కనీసం పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్ కు సైతం నచ్చే విధంగా ఈ సినిమాలు లేకపోవడం గమనార్హం. పూరీ జగన్నాథ్ తన సినిమాలలో స్క్రిప్ట్స్ విషయంలో జరుగుతున్న తప్పులను అయితే గమనించట్లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ రెమ్యునరేషన్ సైతం గతంతో పోలిస్తే భారీ స్థాయిలో తగ్గింది.
పూరీ జగన్నాథ్ కొత్త సినిమాలో హీరో ఎవరనే చర్చ జోరుగా జరుగుతుండగా టాలీవుడ్ యంగ్ హీరోలు ఛాన్స్ ఇస్తే పూరీ జగన్నాథ్ కు పూర్వ వైభవం రావడం కష్టమేం కాదు. ఒకే తరహా సినిమాలను తెరకెక్కించడమే పూరీ జగన్నాథ్ కు మైనస్ అవుతుందనే చర్చ సైతం సోషల్ మీడియాలో జరుగుతోంది. పూరీ జగన్నాథ్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో పూరీ జగన్నాథ్ కు భారీ హిట్లు దక్కడంతో పాటు పూరీ జగన్నాథ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.