'ఒక్కడు' మూవీతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన గుణశేఖర్..ఇప్పుడేమో ఇలా..?
తెలుగునాట హై బడ్జెట్ సినిమాలకు, విజువల్ ఎఫెక్ట్స్‌కు , భారీ సెట్టింగ్స్‌కు గుణశేఖర్ పెట్టింది పేరు. ఖర్చు పెరిగినా ప్రొడక్షన్ స్టాండర్డ్స్ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడరన్న పేరుంది. గుణశేఖర్ సినిమాలోని హీరోల క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా ఉండి, వారి ఇమేజ్ను రెట్టింపు చేసే విధంగా ఉంటుంది.లాఠీ చిత్రంతో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన గుణశేఖర్.. ఆ సినిమాతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కానీ నిరాశ చెందకుండా సొగసు చూడతరమా మూవీతో కొత్తతరహా కథను ప్రేక్షకులకు అందించారు. ఆ వెంటనే చిన్నారులతో రామాయణం, చూడాలనిఉంది, ఒక్కడు , సైనికుడు, అర్జున్ , మనోహరం, మృగరాజు, వరుడు, నిప్పు, రుద్రమదేవి, శాకుంతలం సినిమాలను తెరకెక్కించారు. కానీ వీటిలో సక్సెస్ అయినవి కొన్నే అందులో ముఖ్యంగా 2003 లో అతను దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమా 8 నంది అవార్డులనూ, ఉత్తమ దర్శకుడి పురస్కారంతో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. 2003 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్ళు రాబట్టింది.
అయితే గత కొంతకాలంగా గుణశేఖర్ తన స్థాయికి తగ్గ సక్సెస్ అందుకోవడంలో విఫలం అవుతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో 'రుద్రమదేవి' చిత్రం చేశాడు. అందుకోసం కాకతీయుల చరిత్రను రీసెర్చ్ చేసి, మూడేళ్లపాటు తీవ్రంగా శ్రమించి సినిమాగా మలిచారు. అయితే ఈ ఫస్ట్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డీ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోయింది. బిలో యావరేజ్ అనిపించుకుంది. బన్ని ఉన్నాడు కాబట్టే సినిమా ఆ మాత్రం బయిటపడిందని అన్నారు.జనం మర్చిపోతున్న చరిత్రను తెర మీదకు తీసుకురావడంలో విజయం సాధించాడు కానీ.. ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయి చూసేంత ఎంగేజింగ్ గా సినిమా చూపించలేకపోయారనే విమర్శలువచ్చాయి. ఎమోషనల్ గా ప్రేక్షకుడిని సినిమాతో కనెక్ట్ చేయలేకపోయాడు. అందుకే ఆశించిన స్థాయిలో సినిమా హిట్ అవ్వలేదు.
దాంతో దాదాపు ఏనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత గుణశేఖర్ 'శాకుంతలం' వంటి మరో విమెన్ సెంట్రిక్ మైథలాజికల్ డ్రామాతో మన ముందుకి వచ్చారు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమంత రూత్ ప్రభు టైటిల్ రోల్ లో భారీ బడ్జెట్ తో 3డీలో తీశారు. దీని నిర్మాణంలో గుణ శేఖర్ తో పాటుగా దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ జత చేరారు. అయినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యిపోయింది.ఇదిలావుండగా తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ను ప్రకటించారు అయితే చూడాలి మరి ఈ సినిమా అయినా దర్శకుడిగా గుణశేఖర్‌ను మరల బ్యాక్ బౌన్స్ అనేలా పేరు తెస్తుందో లేదో చూడాలి మరి.