నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరు..? బయటపడుతున్న లవ్ సీక్రేట్స్..!

Thota Jaya Madhuri
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల హీరో నాగచైతన్య పెళ్లి మ్యాటర్ .. ప్రేమాయణం గురించి వార్తలు వినిపిస్తున్నాయి . అసలు వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం ఏర్పడింది..?  నాగచైతన్య చాలా సైలెంట్ .. శోభిత ధూళిపాళ్ల చాలా నాటి . మరి వీళ్లిద్దరికి ఎలా మ్యాచ్ అయింది ..? నాగచైతన్య సమంతని ప్రాణంగా ప్రేమించాను అని చాలా  ఇంటర్వ్యూలలో చెప్పికు వచ్చాడు . ఆమెకు విడాకులు ఇచ్చేసిన ఆయన వెంటనే శోభిత ధూళిపాళ్లకు ఎలా కనెక్ట్ అయ్యాడు..?


ఆమెతో ప్రేమలో ఎలా పడగలిగాడు..? అంటూ రకరకాలుగా జనాలు చర్చించుకుంటున్నారు.  దీంతో సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.  అసలు నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల  వీళ్ళిద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది ఎవరు ..? అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అక్కినేని నాగచైతన్యనే ముందుగా హీరోయిన్  శోభిత ధూళిపాళ్లకు ప్రపోజ్ చేశారట.


ఆమెతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్న మూమెంట్ లోనే  ఆయన ఒకానొక రోజు " నీలాంటి లైఫ్ పార్ట్నర్  నాకు కావాలనుకుంటున్నాను .. నా లైఫ్ మళ్లీ ఫుల్ హ్యాపీ డేస్ రావాలి అనుకుంటున్నాను.. అంటూ నీలాంటి అమ్మాయి నా లైఫ్ లోకి రావాలి అంటూ ఐ లవ్ యు అని తన మనసులోని మాటలు చెప్పేసాడట ". అయితే శోభిత  ధూళిపాళ్ళ  మాత్రం వెంటనే రియాక్ట్ అవ్వలేదట . కొంచెం టైం కావాలి అంటూ నాగచైతన్యను తను పెళ్లి చేసుకుంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ ఆమె కెరియర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విధంగా ఆలోచించి ఇలాంటి మంచి భర్త తనకు మళ్ళీ రాడు అన్న విధంగా ఆమె అభిప్రాయపడి నాగచైతన్య లవ్  ప్రపోజల్ ని ఓకే చేసిందట . ఆ తర్వాత కొన్నాళ్ళు ప్రేమించుకుని ఫైనల్లీ ఇంట్లో పెద్దలను ఒప్పించుకుని ఇప్పుడు పెళ్లి దాక వెళ్తున్నారు ఈ జంట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: