కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తళపతి విజయ్ కొన్ని సంవత్సరాల క్రితం అట్లీ దర్శకత్వంలో విజిల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లో విజయ్ ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ 2019 వ సంవత్సరం అక్టోబర్ 25 వ తేదీన ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయింది. మరి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టి ... ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 3.27 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా ... సిడెడ్ ఏరియాలో 2.8 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.35 కోట్లు , ఈస్ట్ లో 69 లక్షలు , వెస్ట్ లో 65 లక్షలు , కృష్ణ లో 76 లక్షలు , గుంటూరు లో 98 లక్షలు , నెల్లూరు లో 51 లక్షల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో కలుపు కొని 11.01 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ... ఈ మూవీ ఫుల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 11.01 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి బయ్యర్లకు 1.01 కోట్ల లాభాలను అందించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని అందుకుంది.