పుష్ప 2 లో పుష్ప 3 !
లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది అన్న అంచనాలతో ఈమూవీని డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన బిజినెస్ వార్తలు ఇండస్ట్రీ వర్గాలను షాక్ చేస్తున్నాయి. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు జరిగిందని నిర్మాతలు చెపుతున్నారు. విదేశాలతో కలుపుకుని ఈమూవీని ప్రపంచ వ్యాప్తంగా 3వేల ధియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు లీకులు ఇస్తున్నారు. బన్నీకి కేరళ రాష్ట్రంలో ఉన్న క్రేజ్ రీత్యా ఈసినిమా విడుదలయ్యే మొదటిరోజున 24 గంటలు ఏకధాటిగా షోలు వేయాలని మాలీవుడ్ నుండి ఒత్తిడి వస్తున్నట్లు ఈ మూవీ నిర్మాతలు లీకులు ఇస్తున్నారు.
ఈ సినిమా మొదటిరోజున సుమారు 500 కోట్ల వరకు ఓపెనింగ్ కలక్షన్స్ రాబట్టే ఆస్కారం ఉంది అని అంటున్నారు. సాధారణంగా తమిళనాడులో రజనీకాంత్ విజయ్ అజిత్ లాంటి టాప్ హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఇప్పుడు కోలీవుడ్ లో అదేవిధంగా ‘పుష్ప 2’ మ్యానియా రాబోతున్న సంక్రాంతి వరకు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది.
తమిళనాడులో సాధారణంగా రజనీకాంత్ విజయ్ అజిత్ ల సినిమా గురించి ఎంత ఆశక్తిగా ఎదురు చూస్తారో ఇప్పుడు ‘పుష్ప 2’ గురించి కూడ కోలీవుడ్ ఇండస్ట్రీ అంత ఆశక్తిగా ఎదురు చూస్తోంది. దీనితో అల్లు అర్జున్ తమిళనాడులో విజయ్ సినిమా ‘లియో’ ను ఏవిధంగా తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లారో అదేవిధంగా ‘పుష్ప 2’ మ్యానియాతో దక్షిణాది సినిమా రంగాన్ని షేక్ చేయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ‘పుష్ప 2’ క్రియేట్ చేసే రికార్డులను బట్టి ‘పుష్ప 3’ ఆధారపడి ఉంటుంది అన్నమాటలు వినిపిస్తున్నాయి..