సడెన్ గా సుకుమార్ పుష్ప 2 రిలీజ్ డేట్ మార్చింది అందుకేనా..? ఏం ప్లానింగ్ సామీ ఇది..!

Thota Jaya Madhuri
"పండుగ ఒకరోజు ముందుగానే వస్తే మనం వద్దంటామా..?" ప్రెసెంట్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ తోనే పుష్ప2 సినిమా హ్యాష్ ట్యాగ్స్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు బన్నీ అభిమానులు . అసలు బన్నీ నటించిన పుష్ప2 సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అంటూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయిట్ చేసే అభిమానులకి ఎగిరి గంత్తేసే న్యూస్ వినిపించాడు  డైరెక్టర్ సుకుమార్ . నిజానికి సుకుమార్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు . కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మరి థియేటర్స్ లో ఒకరోజు ముందుగానే పండగ రాబోతుంది అని ..పుష్పగాడి రూలింగ్ ఒకరోజు ముందుగానే స్టార్ట్ కాబోతుంది అని ..డిసెంబర్ 5వ తేదీ థియేటర్లో ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.


 ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ముందుగానే సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి.. గెట్ రెడీ బన్నీ ఫాన్స్ అంటూ సంచలన పోస్ట్ ని కూడా చేశారు. దీనితో సోషల్ మీడియా మొత్తం పుష్ప2 హ్యాష్ ట్యాగ్స్ తో హొరెత్తిపోతుంది." వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభమవుతాయి ..బాక్సాఫీస్ వద్ద బాణసంచె ముందుగానే పేలిపోబోతుంది .. ఒకరోజు ముందుగా రికార్డుల వేట పుష్పరాజ్ గాడి పాలన ప్రారంభం కాబోయేది అప్పటినుంచే" అంటూ పవర్ఫుల్ క్యాప్షన్ జత చేశారు .


సడన్గా సుకుమార్  ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అంటూ ఇప్పుడు జనాలతో పాటు అభిమానులు కూడా మాట్లాడుకుంటున్నారు . అయితే దీని వెనుక పెద్ద రీజన్ ఏమీ లేదు అని.. పుష్ప సినిమా పబ్లిసిటీ స్టంట్ ఇది అంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు . పుష్ప 2 6వ తేదీ  రిలీజ్ అవుతుంది అంటే పెద్దగా కిక్ ఉండదు. పుష్ప సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించాలి అంటే ఏదో ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకోవాల్సిందే . అందుకే సుకుమార్ చాలా తెలివిగా సినిమాని ఒక రోజు ముందుగానే థియేటర్స్లోకి తీసుకొస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ కి ఇది నిజంగా బిగ్ గుడ్ న్యూస్ . ఒకరోజు ముందుగానే పండగ స్టార్ట్ కాబోతుంది . సుకుమార్ ఇంకా ఇలాంటి ప్లానింగ్స్ ఎన్నో ఎన్నో చేశారు. సుకుమార్ పుష్ప2 విషయంలో చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నారు. ప్రమోషన్స్ ని కూడా ఓ రేంజ్ లో  నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: