పుష్ప రాజ్ గాడికి అలాంటి వింత జబ్బు.. ఎక్కడి నుంచి వస్తాయి సుకుమార్ నీకు ఈ ఐడియాలు..?

Thota Jaya Madhuri
ప్రజెంట్ కోట్లాదిమంది జనాలు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. పుష్పరాజ్ గాడి రాక కోసం కోట్లాదిమంది 1000 కళ్ళతో ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు . పుష్ప సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలుసు . బన్నీ కెరియర్ నే  కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ లెక్కలను కూడా మార్చేసింది. అలాంటి ఒక క్రేజీ హిట్ అందుకున్న తర్వాత బన్నీ తెరపై కనిపించిందే లేదు. పుష్ప2 సినిమాతో మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతున్నాడు .


ఈ సినిమా కోసం బన్నీ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. కఠిన డైట్ ఏ కాదు లేనిపోని ట్రోలింగ్, అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం ఆయనకు నెగిటివ్గా మారిపోయింది .ఈ సినిమాతోనే ఆ నెగెటివిటీని మళ్లీ పాజిటివిటీగా మార్చుకోవాలని చూస్తున్నాడు బన్నీ . కాగా ఈ సినిమాలో పుష్పరాజ్ ఫుల్ డీ గ్లామర్ లుక్స్ లో కనిపించబోతున్నాడు అని మొదటి సినిమా నుంచి మనకు అర్థం అయిపోయింది . అయితే పుష్ప రాజ్ క్యారెక్టర్ లో నటిస్తున్న బన్నీకు పుష్ప2 సినిమాలో ఒక జబ్బు ఉండేలా డిజైన్ చేశాడట సుకుమార్ .


పుష్పరాజ్ క్యారెక్టర్ అంటే అందరికీ ఇష్టం . కొంతమంది అయితే ఆ పాత్రలో లీనమైపోతూ ఉంటారు . మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లా సైడ్ వాళ్ళు అయితే పుష్పరాజ్ క్యారెక్టర్ ని వాళ్లకు వాళ్లే అంకితం చేసుకున్నట్లు ఉంటారు . అలాంటి పుష్ప రాజ్ కి సుకుమార్ పెట్టిన జబ్బు గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు . అదే పుష్ప 2 సినిమాలో పుష్పకి "చెముడు" ఉన్నట్లు చూపించబోతున్నారట.  ఆయన ఒక జబ్బు మనిషిగా చూపించబోతున్నారట.


పుష్ప వన్ సినిమా ఎండింగ్లో ఫహద్ ఫజిల్ - బన్నీ బాగా పోట్లాడుకుంటారు . శ్రీవల్లి మెడలో తాళి కడతారు పుష్ప రాజ్.  అయితే పుష్ప2 సినిమా స్టార్టింగ్ లోనే ఫహద్ పజిల్ తో గొడవ సీన్స్ ను చూపిస్తారట . ఆ గొడవ సీన్స్ లోనే ఐరన్ రాడ్ తో ఢమాల్ అంటూ లాగి పెట్టి కొడతారట . అప్పటి నుంచి బన్నీకి ఒక చెవు వినపడకుండా వస్తుందట. సినిమాల్లో ఈ ఒక్క "చెవు" వినపడకపోవడం కారణంగా ఎన్నో విషయాలు కూడా ఆయనకు మైన్స్ మారుతాయట. అలా సుకుమార్ సీన్స్ డిజైన్ చేశారట . నిజంగా సుకుమార్ క్రియేటివిటీకి దండం పెట్టాల్సిందే అంటున్నారు బన్నీ అభిమానులు .అయితే పుష్ప రాజ్ క్యారెక్టర్ కి ఆ  చెముడు జబ్బు ఎంతలా సెట్ అవుతుంది..? బన్నీ ఎలా నటించాడు..? అన్నది తెరపై చూడాల్సిందే..!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: