హిట్ స్టేటస్కు అత్యంత దగ్గరగా విశ్వం.. ఆ ముగ్గురి టార్గెట్ కంప్లీట్ అయినట్లేనా..?

Pulgam Srinivas
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కావ్య దాపర్ హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వప్రసాద్ నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు గోపీచంద్ , కావ్య థాపర్ , శ్రీను వైట్ల , టీ జీ విశ్వప్రసాద్ అందరూ కూడా అపజయాల్లో ఉన్నారు. దానితో ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలి అని వీరంతా భావించినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో వీరికి మంచి విజయం దక్కిందా ..? లేదా. మరి ఇప్పటివరకు ఈ సినిమా ఎలాంటి స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. 13 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

13 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.95 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్ర ఏరియాలో 4.26 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.21 కోట్ల షేర్ ... 12.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 13 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకుని 75 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 7.96 కోట్ల షేర్ ... 14.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ మరో 2.3 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబడితే క్లీన్ హిట్ ను అందుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆజయల్లో ఉన్న గోపీచంద్ , కావ్య దాపర్ , శ్రీను వైట్ల , విశ్వప్రసాద్ కి ఈ సినిమా ద్వారా విజయం దక్కకపోయినా కాస్త ఊరట మాత్రం దక్కినట్లే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc

సంబంధిత వార్తలు: