ఇదెక్కడ క్రేజ్ రా మామ.. బాలయ్య షోకి సెలవు కావాలన్న ఉద్యోగులు..!

Divya
నందమూరి హీరో బాలయ్య సినిమాలలో కాకుండా రాజకీయాలలో కాకుండా ఇప్పుడు హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు. ఆహా వేదికగా ఈ రోజున రాత్రి 8:30 నిమిషాలకు అన్ స్టాపబుల్ -4 సీజన్ స్ట్రిమింగ్ కాబోతోంది. మొదటి ఎపిసోడ్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అతిథిగా తీసుకురావడం జరిగింది. ప్రోమో ను కూడా రిలీజ్ చేయగా ఈ ఎపిసోడ్ పైన భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. స్ట్రిమ్మింగ్ కోసం అటు టిడిపి నేతలు కార్యకర్తలు, నందమూరి అభిమానులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

అక్టోబర్ 25న బాలయ్య పండుగగా ప్రకటించాలంటూ హైదరాబాదులో చాలా మంది ఉద్యోగస్తులు పలు రకాల ప్లకార్డులతో ప్రదర్శించడం జరిగింది. అన్ స్టాపబుల్ సీజన్-4 స్ట్రిమ్మింగ్ కాబోతున్న సందర్భంగా శుక్రవారం రోజున సెలవు ఇవ్వాలంటూ పలువురు ఉద్యోగస్తులు కోరారు. హైటెక్ సిటీ పైన కొంత మంది ఉద్యోగస్తులు చేతిలో ప్లకార్డులు పట్టుకొని మరి నిలబడ్డారు. ఈ రోజున బాలయ్య పండుగని హాలిడే కావాలంటూ ఆ ఫ్లకార్డు పైన రాసి ఉంది. ఇవే కాకుండా హైదరాబాదులో పలుచోట్ల ఇలాంటి ప్లక్కార్డులతో చాలామంది కనిపిస్తున్నారట.

ఈసారి చూస్తూ ఉంటే బాలయ్య అన్ స్టాపబుల్-4 సీజన్ గత రికార్డులు అన్నిటిని కూడా బ్రేక్ చేసేలా ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఆహా ఓటిటీ సంస్థకు ఇది బాగా కలిసొస్తుందో చూడాలి మరి. బాలయ్య సినిమాల విషయానికి వస్తే ఇటీవలే అఖండ-2 చిత్రానికి సంబంధించి అధికారికంగా అప్డేట్ అయితే వెలుబడింది. అలాగే డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తూ ఉన్నారు బాలయ్య. వరుసగా భారీ విజయాలు అందుకుంటున్న బాలయ్య తన కథలను సైతం మరింత అద్భుతంగా ఎంచుకుంటూ అభిమానులను ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తూ ఉన్నారు. సీనియర్ హీరోలలో బాలయ్య ఫామ్ లో ఉన్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: