రోలెక్స్ పాత్ర షూటింగ్లో విజయ్ ఎంత టైం లో కంప్లీట్ చేశాడో తెలుసా.. డెడికేషన్ అంటే ఇలా ఉండాలి..?

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో సూర్య ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన తాను నటించిన దాదాపు ప్రతి సినిమాను తెలుగు లో విడుదల చేశాడు. అందులో అనేక సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా విజయాలు సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. తాజాగా సూర్య "కంగువా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో రూపొందించారు. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరి కొంత కాలంలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంత కాలం క్రితం కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విక్రమ్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. సూర్య ఈ సినిమాలో రోలెక్స్ అనే పాత్రలో నటించాడు. సూర్య పాత్ర ఈ సినిమాలో చాలా తక్కువే నిడివి ఉన్న ఈ సినిమా విజయంలో మాత్రం సూర్య పాత్ర చాలా కీలకమైన పాత్రను పోషించింది. తాజాగా సూర్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 

అందులో భాగంగా విక్రమ్ మూవీ లోని రోలెక్స్ పాత్ర షూటింగ్ కోసం ఎంత సమయాన్ని కేటాయించారు అనే ప్రశ్న ఆయనకు ఎదురయింది. దీనికి సూర్య సమాధానం చెబుతూ ... విక్రమ్ సినిమాలోని రోలెక్స్ పాత్ర చిత్రీకరణకు కేవలం అర పూట సమయం మాత్రమే పట్టింది అని సూర్య చెప్పుకొచ్చాడు. ఇకపోతే విక్రమ్ మూవీలోని రోలెక్స్ పాత్రకు గాను సూర్య కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: