నో ఈగో.. నో కాంట్రవర్సీ.. కటౌట్ కే వందల కోట్లు.. అది ప్రభాస్ రేంజ్?
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే పదం ప్రభాస్ కోసమే పుట్టిందేమో అన్న విధంగా ఉంటుంది ఆయన ప్రవర్తన. ఆయన ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ ఆయన సినిమా తెరమీద కనిపిస్తే చాలు వందల కోట్ల వసూళ్లు అలవోకగా వచ్చి అటు నిర్మాతల గల్లా పెట్టిలో చేరిపోతూ ఉంటాయి. ఆయనతో సినిమా అంటే చాలు అంచనా 500 కోట్ల నుంచి మొదలవుతుంది. కొన్ని కొన్ని విషయాలు కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్ అంటూ ఆయన చెప్పే డైలాగులు అభిమానుల విజిల్స్ తో అటు థియేటర్ దద్దరిల్లిపోయేలా చేస్తూ ఉంటాయి.
అంత ఎదిగిన హీరో ఎలా ఉండాలి? హడావిడి చేస్తూ ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉండాలి. కానీ ప్రభాస్ అలా కాదు ఈయన నిజంగా పాన్ ఇండియా స్టారేనా.. అయిన ఇంత సింప్లిసిటీ ఏంటి.. కనీసం తన గురించి తనకు చెప్పుకోవడం కూడా రాదే. మరి చిన్న పిల్లాడి మనస్తత్వం. సినిమాల్లో పవర్ఫుల్గా కనిపించే ప్రభాస్ రియల్ లైఫ్ లో మాత్రం ఇంత మొహమాట పడతాడేంటి అని ఆయనని స్టేజి మీద మాట్లాడుతున్నప్పుడు చూసినప్పుడల్లా ప్రతి ఒక్క అభిమానికి అనిపిస్తూ ఉంటుంది. డార్లింగ్స్ అంటూ స్పీచ్ మొదలుపెట్టి తన అభిమానులపై ప్రేమను ఒక్క చిన్న పదంతో చాటి చెప్పే ప్రభాస్.. టాప్ హీరోగా ఎదగడమే కాదు ఎవరికి సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందు ఉంటాడు. వరదలు వచ్చిన ప్రతిసారి కోట్ల రూపాయల విరాళం ఇస్తుంటాడు. ఇక తన తోటి నటులకు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం అయితే మాటల్లో వర్ణించడం కష్టమే. వద్దు బాబోయ్ వద్దు ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు ఎంతోమంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అభిమానులను డార్లింగ్ అని పిలుస్తూ అందరికీ డార్లింగ్ గా మారిపోయిన ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక చివరిగా 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.