కల్కి సీక్వెల్ లో దుల్కర్ సల్మాన్ ఉన్నారా.. ఈ ప్రశ్నకు లక్కీ భాస్కర్ క్లారిటీ ఇదే!

Reddy P Rajasekhar
మలయాళ హీరో అయినప్పటికీ తెలుగులో అంతకంతకూ క్రేజ్ ను పెంచుకుంటున్న హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. తెలుగులో మహానటి, సీతారామం సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న దుల్కర్ అతి త్వరలో లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కల్కి సినిమాలో చిన్న రోల్ లో మెరిసిన దుల్కర్ కల్కి సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ వయస్సు 41 సంవత్సరాలు కాగా అతని లుక్స్ ను చూసిన వాళ్లెవరూ ఈ విషయాన్ని నమ్మరనే సంగతి తెలిసిందే. మలయాళ ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరిస్తున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ తో మరో హిట్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టాక్ మార్కెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
 
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ రీమేక్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు తాను అంగీకరించానని అన్నారు. లక్కీ భాస్కర్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ అని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు. వెంకీ అట్లూరికి ప్రేక్షకుల పల్స్ బాగా తెలుసని ఆయన తెలిపారు. కల్కి సీక్వెల్ గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో చేస్తానా చేయనా అనేది చెప్పలేనని నాగ్ అశ్విన్ చేయమంటే చేసేయడమే అని పేర్కొన్నారు.
 
లక్కీ భాస్కర్ హిట్ గా నిలిస్తే మాత్రం దుల్కర్ కు తెలుగులో ఆఫర్లు భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. దుల్కర్ సల్మాన్ కు పెరుగుతున్న క్రేజ్ అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దుల్కర్ సల్మాన్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దుల్కర్ సల్మాన్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. దుల్కర్ సల్మాన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: