సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గేమ్ ఛేంజర్ స్టోరీ ఇదే.. మేకర్స్ క్లారిటీ ఇస్తారా?

Reddy P Rajasekhar
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా 2025 సంవత్సరం జనవరి 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సాధారణంగా పెద్ద సినిమాలు శుక్రవారం రోజున థియేటర్లలో విడుదలవుతాయి. ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ గేమ్ ఛేంజర్ సినిమా కూడా శుక్రవారం రోజునే థియేటర్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం.
 
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకుల రోల్స్ లో కనిపించనున్నారు. రామ్ చరణ్ ఇలా తండ్రీ కొడుకుల పాత్రల్లో నటించడం ఇదే తొలిసారి కాగా సోషల్ మీడియా వేదికగా గేమ్ ఛేంజర్ స్టోరీ వైరల్ అవుతోంది. ఈ సినిమా యంగ్ చరణ్ రోల్ తో స్టోరీ మొదలవుతుందని కలెక్టర్ అయిన చరణ్ పాత్ర విలన్లకు సపోర్ట్ చేస్తుందని ఆ విలన్లు ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు అని సమాచారం.
 
అయితే ఆ రాజకీయ పార్టీని తన తండ్రి స్థాపించారని తన తండ్రికి కొంతమంది వెన్నుపోటు పొడిచారని తెలిసి విలన్లకు చరణ్ ఏ విధంగా బుద్ధి చెప్పారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ కథ రొటీన్ గానే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి మేకర్స్ నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.
 
గేమ్ ఛేంజర్ సినిమా కథనం అద్భుతంగా ఉంటే మాత్రం ఈ సినిమా క్రియేట్ చేసే సంచలనాలు అయితే మామూలుగా ఉండవని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం దాదాపుగా మూడేళ్లు పరిమితం కావడం జరిగింది. గేమ్ ఛేంజర్ శంకర్ మార్క్ తో తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాకు సంబంధించి రికార్డ్ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శితం కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: