ఆ హీరో భార్య నడుము గిల్లిన అల్లు అర్జున్..?

Pandrala Sravanthi
ఏంటి అల్లు అర్జున్ వేరే హీరో భార్య నడుము గిల్లారా.. ఛీ ఛీ అల్లు అర్జున్ అలాంటి పని కూడా చేస్తారా.. ఎందుకు అలాంటి చీప్ పనులు చేశారు.. అని ఈ విషయం తెల్సిన చాలామంది తిట్టుకుంటారు. అయితే అల్లు అర్జున్ తో నడుము గిల్లించుకున్న హీరో భార్య ఎవరు.. అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ తో నడుము గిల్లించుకున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత.అయితే సమంత ఒకప్పుడు నాగచైతన్య భార్య కాబట్టి  ప్రస్తుతం ఈ విషయాన్ని నెటిజన్స్ వైరల్ చేస్తూ అల్లు అర్జున్ ఆ హీరో భార్య నడుము గిల్లారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే పుష్ప పార్ట్ వన్ లో సమంత ఐటమ్ సాంగ్ చేసిన సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన నెలకొందట. ఈ పాట చేసే సమయంలో అల్లు అర్జున్ సమంతని నడుము గిల్లే ఒక సన్నివేశం ఉంటుందట. 

కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ సన్నివేశం చేయడానికి చాలా భయపడ్డారట.ఒక రెండు మూడు రోజుల పాటు ఈ సన్నివేశానికి సంబంధించి తలుచుకొని నిద్ర కూడా పోలేదట. అసలు ఆ హీరోయిన్ నడుము నేను ఎలా గిల్లాలి నాకు ఆ సీన్స్ చేయబుద్ది అవ్వట్లేదు అని తెగ బాధపడిపోయారట. కానీ సినిమా షూటింగ్లో భాగంగా ఈ పని కచ్చితంగా చేయాలి అని చెప్పడంతో  డైరెక్టర్ సుకుమార్ నచ్చజెప్పి అల్లు అర్జున్ తో సమంత నడుము గిల్లే సన్నివేశానికి ఓకే చేయించారట.అలా ఊ అంటావా మావా ఉ ఊ అంటావా మామ అనే ఐటెం సాంగ్ లో సమంతతో అల్లు అర్జున్ స్టెప్పులు వేసే టప్పుడు చాలా గిల్టీగా కాస్త సిగ్గుగా కూడా ఫీలయ్యారట.

ఇక అల్లు అర్జున్ ప్రవర్తన చూసిన షూటింగ్ సెట్ లో ఉన్న వారందరూ సమంత అంత ధైర్యంగా చేస్తే అల్లు అర్జున్ మాత్రం ఎంత సిగ్గుపడుతున్నాడో అని నవ్వుకున్నారట. అయితే సినిమాల్లో ఇవన్నీ కామనే.కానీ అప్పుడప్పుడు కొంతమంది నటీనటులు ఇలాంటి సన్నివేశాలు చేయడానికి కాస్త తటపటాయిస్తారు. ఇక అల్లు అర్జున్ సమంత కాంబినేషన్లో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: