సత్తిరెడ్డి..అంటూ డైలాగ్స్ తో గూస్ బంప్స్ తెప్పించిన బాలయ్య డ్యూయల్ రోల్ మూవీ.!
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. రీ రిలీజ్లో కూడా సత్తా చాటింది. 'చెన్నకేశవరెడ్డి’ చిత్రం దాదాపు 70 రోజుల్లో పూర్తి చేశారు డైరెక్టర్ వినాయక్.రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో ఆ సమయంలో వెలువడిన అనేక చిత్రాల పరంపరలో ఇది కూడా ఒకటి. ఇందులో నందమూరి బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి' అనే స్థానిక నాయకుడిగాను, అతని కొడుకైన పోలీస్ ఇనస్పెక్టర్ గాను రెండు పాత్రలు పోషించాడు. చెన్నకేశవరెడ్డి స్థానికంగా పలుకుబడి కలిగిన ఒక కథానాయకుడు. అతని ప్రత్యర్ధులు అతనిని ఒక కేసులో ఇరికించి విచారణ కానీయకుండా మెలికపెట్టి సంవత్సరాల తరబడి తీహార్ జైలులో ఉండేలా చేస్తారు. అతని శ్రేయోభిలాషులు అతని కొడుకును రాయలసీమకు దూరంగా పెంచుతారు. తరువాత చెన్నకేశవరెడ్డి జైలునుండి విడుదలై తిరిగి తన ఇలాకాపై ఆధిపత్యం చెలాయించడం, అతనిని అదుపులో ఉంచడానికి అతని కొడుకునే ప్రభుత్వం అక్కడ నియమించడం ఈ చిత్రంలో క్లైమాక్సుకు దారి తీస్తాయి.
ఇదిలావుండగా ఈ సినిమాలో హెలికాప్టర్ షార్ట్ ఒకటి ఉంటుంది. అది బాలయ్య డూప్ లేకుండా చేశారట అలాగే భూమిలో నుండి సుమోలు పైకి లేచే సీన్ ఉంటుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేదు. ఆ సీన్ ని ఒరిజినల్ గా షూట్ చేశారట.ఈ సినిమాను దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటం.. బాలయ్య డ్యుయెల్ రోల్‌లో చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులకు థియేటర్లలో విజిల్స్ టాప్ లేపాయి.ఈ నేపథ్యంలో ముఖ్యంగా చెన్నకేశవరెడ్డిలో సత్తిరెడ్డి తొక్కించెయ్, సౌండ్ చేయకు కంఠం కోసెస్తా అంటూ బాలయ్య చెప్పే డైలాగులు.. ఆ స్టైల్, సీమ పౌరుషం, మేనరిజం, కద్దరు చొక్కాలు, బాంబు పేలుళ్లు, ఆ పాటలు.. అబ్బబ్బో సినిమా సూస్తాంటే గూస్ బంప్స్ కాదు దానమ్మ మొగుడే రావాలి అన్నట్లుగా ఉంటుంది.అయితే ఈ సినిమాలో బాలయ్య సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ భరత్ గాను, పగతో రగిలిపోయే చెన్న కేశవ రెడ్డి గాను ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.