తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా మంచి స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈయన బ్యానర్ నుండి వచ్చిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధిస్తూ ఉండటంతో రోజు రోజుకి తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ఈయన క్రేజ్ పెరిగిపోతుంది. ఇకపోతే నిర్మాతగా చాలా యాక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తున్న ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నాడు.
కొంత కాలం క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను సూర్య దేవర నాగ వంశీ దక్కించుకున్నాడు. ఇక ఈయన ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాడు. అలాగే ఈ సినిమాను విడుదల రోజు అర్ధ రాత్రి నుండే షో లను కూడా ప్రదర్శించాడు. ఇకపోతే ఈ నిర్మాత తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమాను నిర్మించాడు.
ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించింది. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నారు. దేవర మూవీని అర్ధరాత్రి షో లతో విడుదల చేసిన ఈ నిర్మాత లక్కీ భాస్కర్ సినిమాను ఒక రోజు ముందే ఈవినింగ్ షో లతోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా దేవర కు మించిన స్థాయిలో ఈ మూవీ ని ముందు విడుదల చేయడానికి నాగ వంశీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.