అలా అయితే వెంకీ.. ఇలా అయితే దిల్ రాజు.. ఎటు చూసినా ఒకరు నష్టపోవాల్సిందేనా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ వచ్చింది అంటే భారీ ఎత్తున సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన వీరసింహా రెడ్డి , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రి సంస్థ వారే. ఇలా సంక్రాంతి పండుగకు ఒకే బానర్ నుండి రెండు సినిమాలు విడుదల కావడం ఎప్పుడూ తెలుగు సినీ పరిశ్రమలో జరగలేదు అనే వాదన కూడా ఆ సమయంలో వచ్చింది. ఇక వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితే పునరావృతం కాబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన చాలా కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే ఓ భారీ బడ్జెట్ సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరో వైపు వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడి వరకు అంతా ఓకే కానీ అనూహ్యంగా గేమ్ చేంజర్ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. దీనితో వెంకటేష్ సినిమాని తప్పించి దిల్ రాజు కేవలం గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి బరిలో ఉంచుతాడా .? లేక రెండు సినిమాలను సంక్రాంతి భరిలో ఉంచుతాడా అనేది సస్పెన్స్ గా మారింది.

ఒక వేళ సంక్రాంతి భరి నుండి వెంకటేష్ మూవీ ని తప్పిస్తే ఆయనకు కాస్త నష్టం జరిగే అవకాశం ఉంది. అలా కాదు అని వెంకటేష్ సినిమాను బరిలో ఉంచినట్లయితే నిర్మాతగా దిల్ రాజు కు నష్టం జరిగే అవకాశం ఉంది. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ వెంకటేష్ రెండు సినిమాలను దిల్ రాజు విడుదల చేస్తాడా .? లేక ఒక సినిమాను ఆపేస్తాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: