ఖుషి : ఒక్కసారిగా ఈ మూవీతో అందరి దృష్టి ఆమెపైనే.. అంతలా మాయ చేసింది..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు . కానీ అందులో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటా రు. ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయి ఉన్న హీరోయిన్లుగా క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎన్ని సినిమాల్లో నటించాము అనే దాని కంటే కూడా ఎంత గొప్ప సినిమాల్లో నటించాము అనేది ముఖ్యం అనే విషయాన్ని కూడా కొంత మంది పదే పదే గుర్తు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కొంత మంది నటీ మణుల కెరియర్లో కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే స్థాయిలో ఇంపాక్ట్ ను చూపిస్తూ ఉంటాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో ఒకరు అయినటువంటి ఓ బ్యూటీ తన కెరియర్ ప్రారంభంలో నటించిన ఓ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించింది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు ఆమె భూమిక. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జై సూర్య దర్శకత్వంలో రూపొందిన ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్గా నటించింది.

ఈ సినిమా కంటే ముందు ఈమెకు తెలుగులో పెద్ద గుర్తింపు లేదు. కానీ ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ఇందులో ఈమె సూపర్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఒక్క సారిగా తెలుగు సినిమా పరిశ్రమ దృష్టి మాత్రం ఈమెపై పడింది. ఆ తర్వాత ఈమె చాలా మంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన నటిగా కెరియర్ను కొనసాగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: