దేవర : 20 రోజుల విధ్వంసం.. వరల్డ్ వైడ్ గా ఏ ఏరియాలో ఎంత వచ్చిందో తెలుసా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన 20 రోజుల బాక్సాఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఈ 20 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

20 రోజుల్లో నైజాం ఏరియాలో ఏ సినిమాకు 60.91 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 30.18 కోట్లు , ఉత్తరాంధ్రలో 17.61 కోట్లు , ఈస్ట్ లో 10.23 కోట్లు , వెస్ట్ లో 8.10 కోట్లు , గుంటూరు లో 13.19 కోట్లు , కృష్ణ లో 9.02 కోట్లు , నెల్లూరు లో 6.68 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 20 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 155.92 కోట్ల షేర్ ... 225.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 20 రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటకలో 17.8 కోట్ల కలెక్షన్లు దక్కగా , తమిళనాడు లో 4.14 కోట్లు ,   కేరళ లో 97 లక్షలు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 33.80 కోట్లు , ఓవర్సీస్ లో 35.93 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 

మొత్తంగా ఈ సినిమాకు 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 248.53 కోట్ల షేర్ , 433.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 182.25 కోట్ల ప్రి రిలీజ్ బిసినెస్ జరగగా ఈ మూవీ 184 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 64.56 కోట్ల లాభాలను అందుకుంది. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: