ఇటు చ‌ర‌ణ్‌... అటు వెంకీ - మ‌హేష్‌... ఈ క‌బ‌డ్డీ పోటీలో గెలిచిందెవ‌రంటే..?

Amruth kumar
( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ లో ప్రతి సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ... ఈ క్రమంలోనే 2013 సంక్రాంతి కానుకగా రెండు ఆసక్తికరమైన సినిమాల మధ్య పోటీ జరిగింది .. రామ్ చరణ్ హీరో గా స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్‌ దర్శకత్వంలో నాయక్‌ సినిమా తెరకెక్కింది .. రామ్ చరణ్ , వి వి వినాయక కాంబినేషన్లో ఇది తొలి సినిమాగా నిలిచింది ..  రామ్ చరణ్ ఇందులో రెండు పాత్ర‌లు పోషించారు . కాజల్ అగర్వాల్ , అమలాపాల్ హీరోయిన్లుగా నటించారు . అదే టైంలో నాయక్ సినిమాకు పోటీగా విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసిన నటించిన‌ మల్టీ స్టార్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయింది .

ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మాత వెంకటేష్ కి జోడిగా అంజలి హీరోయిన్గా నటించింది.. అలాగే మహేష్ బాబుకు జోడిగా సమంత నటించింది.. అంతకుముందు మహేష్ సమంత కాంబినేషన్లో దూకుడు సినిమా రాగా వెంటనే మరోసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని వీరిద్దరూ కలిసి నటించారు .. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటా పోటీగా తెలపడ్డాయి .. నాయక్ సినిమా లో కామెడీ యాక్షన్ వర్కౌట్ అయింది .. అయితే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం తో పాటు పైగా విక్టరీ వెంకటేష్ - మహేష్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా కావడం అటు సమంత హీరోయిన్ గా ఉండడంతో ఈ సినిమాకు కాస్త ఎక్కువగా ఈ తెలుగు ప్రేక్షకుల కు కనెక్ట్ అయ్యారు .. అలా 2013 సంక్రాంతి విజేతగా నాయక్ సినిమాపై పై చేయి సాధించి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు విజేత‌గా నిలిచిందని చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: